ప్రైవేట్ బ్యాంకులలో ఒకటి కోటక్ మహీంద్రా బ్యాంక్ వినియోగదారులకు హెచ్చరిక చేస్తోంది.. కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. దీంతో ఈ బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఎఫ్‌డీలపై ఎంత వడ్డీ వస్తోందో ఒకసారి చూడాలి.7 రోజుల నుంచి 30 రోజుల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 2.5 శాతం వడ్డీ వస్తోంది. 31 రోజుల నుంచి 90 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ లభిస్తుంది.


91 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీల పై 3.25 శాతం వడ్డీ వస్తుంది. 180 రోజుల నుంచి ఏడాది లోపు ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీని పొందవచ్చును. పిక్సెడ్ డిపాజిట్ల పై అధిక వడ్డీని పొందవచ్చును.ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.5 శాతం వడ్డీ లభిస్తుంది. 390 రోజుల నుంచి 23 నెలల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ పొందొచ్చు. 23 నెలల నుంచి 3 ఏళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 శాతం వడ్డీ వస్తుంది. 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వరకు ఉన్న ఎఫ్‌డీలపై 5.1 శాతం వడ్డీని పొందవచ్చు..


విషయానికొస్తే..4 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలపై 5.3 శాతం వడ్డీని పొందొచ్చు. మార్చి 25 నుంచి ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఇకపోతే సీనియర్ సిటిజన్స్ కూడా ఈ బ్యాంక్ మంచి బెనిఫిట్స్ ను అందిస్తున్నారు.సీనియర్ సిటిజన్స్ 50 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీని పొందే ఛాన్స్ ఉంటుంది. ప్రముఖ బ్యాంకులలో ఈ బ్యాంక్ కూడా ఒకటి కావడంతో వడ్డీలకు సంబంధించి మంచి లాభాలు ఉంటాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: