అలా కాకుండా కొన్ని పద్దతులు ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా చేసిన పేమెంట్ ను చేస్తే డబ్బులు వెనక్కి వస్తాయట అదేలానో ఇప్పుడు చూద్దాం.. క్రెడ్ అనే యాప్ ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది.
క్రెడ్ యాప్ ద్వారా సులభంగానే క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించొచ్చు. ఈ యాప్ వాడే వారికి 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సందర్భంగా క్రెడ్ ఈ ఆఫర్ అందిస్తోంది. క్రెడిట్ స్కోర్ బాగున్న వారు మాత్రమే ఈ యాప్ ఉపయోగించడం వీలవుతుంది.
ఐపీఎల్ పవర్ ప్లేలో మీరు క్రెడ్ యాప్ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లు కడితే.. మీ చెల్లించిన బిల్లు మొత్తాన్ని పూర్తిగా వెనక్కి పొందొచ్చు. ఎలాంటి పరిమితులు లేవు. అంటే మీరు పవర్ ప్లే జరుగుతున్నప్పుడు మీరు రూ.50 వేల బిల్లు కడితే.. మీకు రూ.50 వేలు వెనక్కి వస్తాయి.. ఇలా క్యాష్ బాక్ అనేది కొందరికి మాత్రమే వస్తుంది.విన్నర్ల పేరును క్రెడ్ ప్రకటిస్తుంది. ప్రతి మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ 16వ ఓవరులో విజేతల పేర్లు వెల్లడి అవుతాయి. ఇకపోతే క్రెడ్ యాప్ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లు కడితే రివార్డు పాయింట్లు కూడా పొందే అవకాశం ఉంది.. చూసారుగా అందులో మీ పేరు కూడా ఉందేమో.. మీరు కూడా ఇలా ట్రై చేయండి..