కరోనా మహమ్మారి అత్యంత వేగంగా కరాళ నృత్యం చేస్తుంది. గత ఏడాది మార్చి నుంచి తన ప్రభావాన్ని చూపిస్తూ వస్తుంది. ఇప్పటికే ప్రపంచం ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతుంది. కాగా, భారత దేశం పరిస్థితి మాత్రం మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది నుంచి ఈ ఏడాది వరకు ఎటువంటి బిజినెస్ చేయాలనుకున్నా కూడా జనం భయపడుతున్నారు. ఎక్కడా కరోనా జీవితం మీద కూడా దెబ్బ కొడుతుంది అని.. ప్రముఖ వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇచ్చింది.

ఆటో మొబైల్ కంపెనీ ల పరిస్థితి దారుణం.. కొత్తగా లాంఛ్ చేసిన వాహనాలు అన్నీ కూడా ఉన్న స్టాక్ కు ఆఫర్లు ప్రకటించి సెల్ అయ్యేలా చూస్తున్నారు. ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ బైక్స్ తయారీని తాత్కాలికంగా నిలిపేసింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ పార్ట్స్ సెంటర్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాల్లో తయారీని నిలిపేస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 22 నుంచి మే 1 మధ్య నాలుగు రోజుల పాటు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్లాంట్లు మూతపడతాయని తెలిపింది...


ఈ షట్‌-డౌన్ సమయాన్ని ఆయా కేంద్రాల్లో అవసరమైన నిర్వహణ పనుల కోసం వినియోగించనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఇప్పుడు ఉత్పత్తిని నిలిపేసినా.. డిమాండ్‌కు తగినట్లుగా ఈ త్రైమాసికం మిగతా నెలల్లో ఉత్పత్తిని పెంచుతామని తెలిపింది.ఇప్పటికే హీరో సంస్థ తమ కార్పొరేట్ ఆఫీస్‌ల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది.. ఇటు చూసుకుంటే ఇంకా చాలా కంపెనీలు కూడా ఇదే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. అందులో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిన సందర్భంలో ఇలా చేయడమే మేలని కొందరు అభిప్రాయ పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: