గూగుల్ మ్యాప్.. ఈ మ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళితే ఖచ్చితంగా ఈ మ్యాప్ ఉండాలి.. లేకుంటే ఇక అంతే.. తెలియని ప్రాంతాన్ని ఇట్టే చెప్పిస్తింది. కాబట్టే దీన్ని అందరూ సరదాగా జై గూగుల్ తల్లి అంటుంటారు. ఇప్పటి వరకు ఈ మ్యాప్ ను ప్రదేశాలను చూడటానికి మాత్రమే ఉపయోగించేవారు.. కానీ ఇప్పుడు పెట్రోల్ , డీజిల్ ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు.అదెలానో ఇప్పుడు చూద్దాం..


ప్రస్తుతం పెట్రోల్ లేదా డీజిల్ రేట్లు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. సామాన్య జనం బైకు లేదా కారు తీయాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి వారికి గూగుల్ మ్యాప్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఏ దారిలో వెళ్తే తక్కువ పెట్రోల్, డీజిల్ తో చేరుకోగలమో చూపించే అల్గారిథమ్ ను గూగుల్ డెవలప్ చేస్తోంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ నిజం.గూగుల్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ఖాతాలో పొందుపరిచింది.


ఇప్పటి వరకు మనం చేరుకోవాల్సిన గమ్యానికి ఎంత టైం లో చేరుకున్నాం అనేది మాత్రమే చూసి ఉంటాము.. కానీ, ఇకమీదట అక్కడకు వెళ్ళడానికి ఎంత ఇంధనాన్ని వాడాము అనే విషయాలను గురించి ప్రత్యేకంగా చెప్తుందట..ఎంత టైమ్ ఆదా అవుతుందో చూపే బదులు కస్టమర్ కు ఎంత ఇంధనం ఆదా అవుతుందో అంచనా వేసి నేవిగేషన్ టూల్స్ చూపిస్తాయి. దీంతో మనం తక్కువ ఇంధనంతో ఆ రూట్లో వెళ్లొచ్చు. కానీ ఇంధనం తక్కువ అయ్యే రూట్ ఆప్షన్ (ఫ్యూయల్ ఎఫీషియంట్) ఆన్ చేసి,వీటితో పాటు ఇంతకు ముందు ఉన్న అన్ని ఆప్షన్లను కూడా గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. వినడానికి బాగుంది కదూ. అయితే దీనికి కాస్త టైమ్ పట్టవచ్చు.. మొత్తానికి ఈ ఏడాదిలోనే అందుబాటులోకి వస్తుందని గూగుల్ సంస్థ వెల్లడించింది.. ఇలా చూసుకుంటే పెట్రోల్ , డీజిల్ వాడకం భారీ తగ్గినట్లే అని గూగుల్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: