ఇప్పుడు దేశంలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు జనాలను విపరీతంగా భయాందోళన కు గురి చేస్తుంది. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యం లో వాణిజ్య వ్యాపార సంస్థలు భారీ నష్టాల ను చవిచూడాల్సి వచ్చింది.. ఇప్పటికీ కొన్ని కంపెనీలు దుకాణాలు సర్దుకునే పరిస్థితి ఏర్పడింది.. ఆటో మొబైల్ కంపెనీల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా తయారైంది.. కొత్తగా చేయలేము, పాత వాటిని అమ్ముకొనులేము అన్న విధంగా మారింది. 


ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ గత కొన్ని రోజులుగా ధరలు తగ్గించారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యం లో మళ్లీ ధరలను పెంచేస్తున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. భారత్ లో తమ అన్ని మోడళ్ల కార్ల ధరలను శనివారం నుంచి పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇప్పటికే కార్ల ను బుక్ చేసుకుని డెలివరీకి వేచిచూస్తున్న వారికి ధరల పెంపు వర్తించబోదని కంపెనీ స్పష్టం చేసింది. వ్యాపార వ్యూహ ప్రణాళిక లో భాగంగా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 


టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర పేర్కొన్నారు .ఇక స్టీల్ ఇతర లోహాల ధరల పెరుగుదలతో కొంత భారాన్ని వినియోగదారులకు మళ్లించక తప్పలేదని కంపెనీ ఓ ప్రకటన లో పేర్కొంది.. మరోవైపు ఏయే మోడల్ పై ధర ఎంత పెరుగుతుందనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే భారత్ లో తమ అన్ని కార్లపై సగటున 1.8 శాతం వరకూ ధరలు పెరుగుతాయని, మోడల్స్ వాటి వేరియంట్స్ కు అనుగుణంగా ధరల పెంపు ఉందని పేర్కొన్నారు. ఇది నిజంగానే షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.  హోండా, వోక్స్ వేగన్ కార్లకు కూడా ధరలను పెంచనున్నట్లు తెలుస్తుంది. ఇక నిత్యావసర వస్తువుల పై కూడా ధరలను పెంచినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: