ప్రేమలో పడడం, అందులో ఇబ్బందులు ఎదుర్కోవడం ఎంతటివారికైనా తప్పలేదు.. గొప్పగొప్పవారు పెద్దలను ఎదురించి ప్రేమించి పెళ్లి చేసుకుని వారి జీవితాల్లో సక్సెస్ అయ్యారు.. అలాంటి వారిలో ఈ తరం ప్రేమికులు కూడా ఉన్నారు.. అలాంటి ప్రేమ జంటలలో ఒకరు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అంజలి ల జంట.. వీరి లవర్ స్టాయ్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉన్నాయట.. గూగుల్ సీఈఓ అనగానే ఎవరైనా కళ్ళు మూసుకుని పిల్లను ఇస్తారు వీరేంటి అనుకుంటున్నారు.. ఆకతా ఏంటో, దాని కమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

 జూలై 12 1972లో చెన్నైలో జన్మించిన అయన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న సీఈవో ల జాబితాలో ఒకరిగా నిలిచారు. అలాంటి సుందర్ తన భాగస్వామి ని అంజలి ని ఐఐటి ఖరగ్ పూర్ లో మొదటిసారి కలుసుకున్నారు.  మొదట్లో ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత క్రమక్రమంగా ప్రేమించుకున్నారు.. అయితే ఒకేసారి అంజలి అయన ప్రేమను ఒప్పుకోలేదట.. సుందర్ ని చాలారోజులు పరిశీలించిన తర్వాతే అతడి ప్రేమను ఒప్పుకుందట.. ఒక సాధారణ కుటుంబ వ్యక్తి కాబట్టి ఉద్యోగం సంపాదించగానే వారిద్దరూ కుటుంబంతో మాట్లాడి వారి ప్రేమ గురించి చెప్పడంతో ఇంట్లో వాళ్ళు అంగీకరించారు.

ఆ తరవాత గూగుల్ కి వెళ్లడం అక్కడ సీఈఓ అవ్వడం జరిగిపోయాయి.. నిజానికి భార్య సలహాతోనే సుందర్ ఈ స్థాయి కి వచ్చాడని చెప్తుంటారు.. ఒకానొక సమయంలో  ట్విట్టర్ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు అతనికి పెద్ద ఆఫర్ ఇచ్చాయి. అయితే భార్య సలహా వల్లనే గూగుల్ లో ఉండి ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అయ్యారు. 48 సంవత్సరాల వయసులో కూడా ఫిట్నెస్ గా కనిపించే సుందర్ పిచాయ్ అలాగే అతడి భార్య అంజలి కూడా రోజు క్రమం తప్పకుండా ఫిట్నెస్ వ్యాయామాలు చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: