వెహికల్ రుణాలు పొందిన కస్టమర్లకు జీపీఎస్ డివైజ్ కమిషన్ రీఫండ్ చేస్తామని ప్రకటించింది బ్యాంకు. దీంతో ఈ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న చాలా మందికి బెనిఫిట్ జరగనుంది. ఇక వెహికల్ రుణాలు తీసుకున్న వారు ఇప్పటికే జీపీఎస్ డివైజ్ తీసుకొని ఉంటే వారికి త్వరలోనే ఆ మనీ రీ ఫండ్ చేయనుంది బ్యాంకు. కాగా 14వ ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ దాకా తీసుకున్న వాహన రుణాలకు ఇది వర్తిస్తుందని సంస్థ తెలిపింది.
కాగా రీ ఫండ్ డబ్బులు కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లలో ఆడ్ చేస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది. ఒకవేళ కస్టమర్ల రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేసి ఉన్నట్లయితే.. కస్టమర్లు బ్యాంక్ అధికారులను సంప్రదించొచ్చని, తద్వారా లాభం పొందవచ్చిన వివరించింది. లేదంటే ఈమెయిల్ ద్వారా పంపడం, ఫోన్ కాల్ లాంటివి చేయాలని కోరింది సంస్థ కోరింది. ఇందుకు గాను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెల రోజుల్లో కస్టమర్లు అప్లై చేసుకోవడానికి గడువు ఇచ్చింది.
ఇక వాహన రుణాల్లో ఏమైనా అవకతవకలు జరిగితే దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై రూ.10 కోట్ల ఫైన్ వేసిన సంగతి అందరికీ విదితమే. ఈ పరిణామ క్రమంలోనే ఇప్పుడు బ్యాంక్ వెహికల్ రుణాలు పొందిన కస్టమర్లకు జీపీఎస్ డివైజ్ కమిషన్ రిఫండ్ చేస్తుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంకు .