ఇప్పుడు పెంచిన జీతాలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుంది అని కంపెనీ వెల్లడించింది. ఈ క్యాలెండర్ సంవత్సరం లో ఇలా వేతనాలు పెంచడం ఇది రెండో సారి. వలసలను తగ్గించడానికి, టాలెంట్ ఉన్న ఉద్యోగుల ను మళ్ళీ కంపెనీకి తీసుకొచ్చే ప్రయత్నం అని అధికారులు చెప్పుకొచ్చారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగుల కు ఊరట కలుగుతుంది. కంపెనీ ప్రాఫిట్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
2021 లో ఏడాది మొదలైన నెలలోనే అంటే జనవరి లో జీతాలను పెంచిన విషయం అందరికి తెలుసు. 40వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఐటీ సేవల కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఉద్యోగుల ను నియమించుకోవాలని ఆలోచన లో ఉన్నట్లు స్పష్టం చేశారు. గత ఏడాది కేవలం 20 శాతం మందికి మాత్రమే ఇంక్రిమెంట్ ఇచ్చిన కంపెనీ ఇప్పుడు 80 శాతం మంది సిబ్బందికి జీతాల ను పెంచనుంది. ఈ ఏడాది 20 మందికి ఉద్యోగాలను కూడా కల్పించింది. అదే విధంగా మరో కంపెనీ విప్రో కూడా జీతాల ను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి జీతాలు అమలు అవుతాయి. టీసీఎస్ కూడా ఏప్రిల్ నెల నుంచి జీతాల ను పెంచారు. ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ నిర్ణయం తో మళ్ళీ ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది.