బ్యాంకు అకౌంటు ఉన్నవారు.. తరచూ బ్యాంక్స్ కి వెళ్లే కస్టమర్లు బ్యాంకు సెలవు దినాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. బ్యాంక్ హాలిడేస్ ప్రకారం తమ కార్యకలాపాలను షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలను ప్రతి నెల అధికారులు వినియోగదారుల కోసం చెబుతుంటారు. ఈసారి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకు సంబంధించి బ్యాంకుల సెలవు దినాల వివరాలను వెల్లడించింది. అయితే జులై నెలలో బ్యాంకు సెలవు దినాలు ఏంటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.


కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మొన్నటి వరకు లాక్ డౌన్ అమలు చేయడంతో బ్యాంకులు పూర్తి స్థాయిలో పని చేయలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో బ్యాంక్ లు యధావిధి గా పనిచేస్తున్నాయి.

ఇక జులై నెలలో బ్యాంకుల సెలవు దినాల వివరాలు తెలుసుకుంటే..

జులై 4 - ఆదివారం



జులై 10 - రెండవ శనివారం



జులై 11 - ఆదివారం



జులై 12 - కాంగ్ (రథజత్ర) / రథయాత్ర



జులై 13 - భాను జయంతి



జులై 14 - దృక్ప శేచి



జులై 16 - హరేల



జులై 17 - యు టిరోట్ సింగ్ డే/ కర్చీ పూజ



జులై 18 - ఆదివారం



జులై 19. - గురు రింపోచి తుంగ్ కార్ శేచి



జులై 20 - బక్రీద్



జులై 21 - బక్రి ఈద్ (ఈద్ ఉల్ జుహా) (ఈద్ ఉల్ అదా)



జులై 24. - నాలుగో శనివారం



జులై 25 - ఆదివారం



జులై 31 - కేర్ పూజ



మొత్తంగా చూసుకుంటే జులై నెలలో 15 రోజులు బ్యాంకులు బంద్ అని చెప్పుకోవచ్చు. ఆర్బిఐ ప్రకటించిన ఈ బ్యాంక్ హాలిడేస్ ప్రకారం మీ కార్య కలాపాలను ప్లాన్ చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: