సాధారణంగా మేనేజర్  ఉద్యోగం అంటే చాలామంది కల అది. అట్లాంటి ఉద్యోగం వస్తే ఎవరైనా వదులుకోవడానికి ఇష్టపడరు.. ఒక అతను మాత్రం లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని, కార్పొరేట్ స్థాయిలో ఉద్యోగం వచ్చినా, అది కూడా వద్దు అని అనుకున్నాడు. ఇక కోళ్ల పెంపకం మంచి ఆదాయం ఇస్తుంది అనుకొని, ఉద్యోగానికి గుడ్బై చెప్పి, నాటు కోళ్లను పెంచుతున్నాడు. అంతే కాదు రెండు చేతుల మంచి ఆదాయాన్ని పొందుతూ, చాలా మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాడు. ఉద్యోగాన్ని వదిలి నాటు కోళ్ల పెంపకం పై దృష్టి పెట్టిన ఇతనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవంగా సత్కరించింది. ఉత్తమ రైతుగా కూడా అవార్డు ప్రకటించింది. అతనెవరు.. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం..


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి ఎంబీఏ పూర్తి చేశాడు. అంతేకాదు ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో కూడా సేల్స్ మేనేజర్. ఇక వారంలో ఐదు రోజులే పని. మిగతా రెండు రోజులు ఖాళీ.. అయితే ఈయన ఆ రెండు రోజులు కూడా ఖాళీగా ఉండడం ఎందుకు అని ఒక ఆలోచన చేశాడు. అదే నాటు కోళ్ల పెంపకం. ఇక ఈ నాటు కోళ్ల పెంపకంపై మక్కువ ఎక్కువగా ఉండడంతో ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి, గుంట కోడూరు అనే గ్రామంలో కొంత స్థలం అద్దెకు తీసుకుని, అక్కడ కోళ్ల పెంపకం ప్రారంభించాడు.

అయితే కొత్త వ్యాపారం కాబట్టి మొదట్లో మార్కెటింగ్ చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనా, తెలివిగా తట్టుకొని వాటిని ఎదుర్కొన్నాడు. ఇక సోషల్ మీడియా వేదికగా తన కోళ్ల పెంపకం గురించి అన్నింటా ప్రచారం చేశాడు. ఇక అనుకున్న విధంగానే ఆయన వ్యాపారం కూడా వృద్ధి చెందుతూ వచ్చింది. ఇక ప్రదీప్ ఫామ్స్ అండ్  హెచరీస్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టి , అంతేకాదు చికెన్ వరల్డ్ కంపెనీ ను  కూడా ప్రారంభించడం జరిగింది. ఇక ఇందులో దాదాపు సిల్కీ, కడక్నాథ్ కోళ్లు, bv 380 వంటి అనేక జాతుల తో పాటు బాతుల పెంపకం కూడా ప్రారంభించాడు. ఇక ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందడంతో పాటు ,  రెండు వేలకు పైగా ఇతర కోళ్ల జాతులున్నాయి. ఏది ఏమైనా నాటు కోళ్ల పెంపకం తో మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు ప్రదీప్.


మరింత సమాచారం తెలుసుకోండి: