ఇటీవల మోడీ ప్రభుత్వం సరికొత్త కాంటెస్ట్ లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా ఒక సరికొత్త కాంటెస్ట్ తో మన ముందుకు వచ్చింది. ఇందులో ఎవరైతే గెలుస్తారో,వారికి  మొదటి బహుమతి కింద 15 లక్షల రూపాయలను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇక మౌలిక సదుపాయాల రూప కల్పన కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడానికి ఇప్పుడు సరికొత్తగా డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.


అయితే ఈ విషయాన్ని 2021 కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని  ప్రకటించింది. జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద ఏడు వేల ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రూ.111 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇందుకోసం డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కు కావలసిన లోగో, ట్యాగ్లైన్ , పేరు సూచించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం అందరిని కోరుతోంది. దీనిలో భాగంగానే ఈ పోటీ ప్రారంభించడం జరిగింది. అయితే ఇందులో కొన్ని కేటగిరీలను కూడా డివైడ్ చేయడం జరిగింది . ఒక్కో కేటగిరి లో గెలిచిన వారికి రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి సిద్ధంగా వుంది.


ఈ పోటీలో పాల్గొనే వారు ఎవరెవరున్నారో.. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 2021 ఆగస్టు 15వ తేదీని చివరి తేదీ గా ప్రకటించడం జరిగింది. టెస్టులో భారత పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు. ముందుగా ఎవరైతే ఈ లోగో , ట్యాగ్ లైన్ అలాగే ఇన్స్టిట్యూషన్ కు సంబంధించిన పేరును సూచించేటప్పుడు విజువల్ సిగ్నేచర్ , సులభంగా పలకడం లేదా సులభంగా గుర్తు తెచ్చుకోగలిగే అంశాలను దృష్టిలో పెట్టుకొని , వాటికి తగ్గట్టుగా రూపొందించాలని ప్రకటించింది.

ఈ పోటీకి కావలసిన పూర్తి వివరాలను https://www.mygov.in/ అనే వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: