మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఒక పద్ధతి ప్రకారం పెట్టుబడులు పెడితే మీకు భవిష్యత్తులో కోట్ల లాభాలను తెచ్చిపెడతాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. ఇందులో రాబడి శాతం 12 గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా 25 సంవత్సరాల పాటుగా పెట్టుబడులు పెడితే మీరు జీవితంలో మీకు ఫైనాన్సియల్ సేఫ్టీ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మీరు ఈ సిప్ పద్దతిలో ఎక్కువ మొత్తంలో ఒకే సారి డబ్బును పొదుపు చేయాల్సిన అవసరం లేదు. మీదగ్గర ఉన్న అమౌంట్ ను సిప్ లో పొదుపు చేస్తే, మీ టెన్యూర్ పూర్తయ్యేలోపు ఎక్కువ మొత్తంలోనే లాభాన్ని గడించవచ్చని చెబుతున్నారు.
అంతే కాకుండా మీరెంతయితే మొదటిగా కట్టారో, పోయే కొద్దీ మీ ఆదాయానికి తగినట్లుగా డిపాజిట్ అమౌంట్ ను పెంచుకుంటూ పోతే, వడ్డీ అధికంగా పొందడానికి వీలుగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎంప్లాయిస్ మరియు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఒక సువర్ణావకాశంగా చెప్పొచ్చు. అయితే ఈ సిప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీకు దగ్గర్లోని మ్యూచువల్ ఫండ్స్ ఆఫీస్ కు వెళ్లి కలవండి. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.