భారతదేశంలో కరెన్సీకి హయ్యార్ అథారిటీ అయిన ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఐడియా) సేఫ్ డిపాజిట్ లాకర్స్ రూల్స్ మార్చింది. ఇందుకుగాను రెంటల్ చార్జీలను పెంచేసింది. నిబంధనలు కూడా మునుపిటి కంటే కూడా కఠినతరం చేసింది ఆర్‌బీఐ. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ బ్యాంకులలో లాకర్స్ తీసుకునే వారి కోసమై కొత్త రూల్స్‌పై గైడ్ లైన్స్ జారీ చేసింది. గతంలో ఉన్న బ్యాంకు లాకర్ సర్వీసుల నిబంధనలను సవరించి నయా రూల్స్ తీసుకొచ్చింది. ప్రకృతి వైపరిత్యాలైన అగ్నిప్రమాదం, భవనం కుప్పకూలడం‌తో పాటు బ్యాంకు సిబ్బంది మోసం, దొంగల చోరీ వంటి కారణాలతో లాకర్లలో దాచిన డబ్బులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో వార్షిక లాకర్ అద్దెకు గరిష్టంగా 100 రెట్లు వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది.

 చట్ట విరుద్ధమైనవి ఏవి కూడా బ్యాంకు లాకర్స్‌లో ఉంచడానికి వీల్లేదని తెలిపింది. ఇకపోతే గతంలోనూ ప్రకృతి విపత్తుల నష్టానికి బ్యాంకులు బాధ్యత వహించగా, ఇప్పుడు కూడా ఆ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంకు బ్రాంచిలన్నీ కూడా ఇక లాకర్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయనేది లిస్టు డిస్‌ప్లే చేయాల్సి ఉంటుంది. ఈ సవరించిన నిబంధనలు ప్రస్తుత, నూతన కస్టమర్స్‌కు వర్తిస్తాయి.


 కస్టమర్స్ సౌకర్యార్థం అందిస్తున్న ఈ లాకర్‌ లేదా సేఫ్‌ కస్టడీ ఆర్టికల్స్ సర్వీసులను సమీక్షించిన తర్వాతే పలు సూచనలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకున్నది. అనంతరం లాకర్స్ నిబంధనల్లో పలు సవరణలు చేసింది. లాకర్స్‌కు సంబంధించిన గైడ్ లైన్స్‌లో గతంలో వాటిని ఉంచుతూనే కొన్ని కొత్త సవరణలు చేసింది ఆర్‌బీఐ. ఎవరైనా కస్టమర్ వరుసగా మూడేళ్ల పాటు లాకర్స్ అద్దె చెల్లించని యెడల ఆయా లాకర్స్‌ను ఓపెన్ చేసే చాన్స్ బ్యాంకులకు ఇచ్చింది ఆర్‌బీఐ. ఇక మరణించిన లాకర్, అద్దెదారుల క్లెయిమ్స్ పరిష్కరించడంతో పాటు లాకర్స్‌లోని మనీని రిలీజ్ చేయాలని ఆర్‌బీఐ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: