ఇకపోతే గత సంవత్సరం తీసిన లెక్కల ప్రకారం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రాధా కిషన్ దమాని 16.5 బిలియన్ డాలర్ల ఆదాయంతో 117 వ స్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో మన దేశానికి చెందిన ముకేశ్ అంబానీ ,గౌతమ్ అదానీ ,లక్ష్మీ మిట్టల్, అజీమ్ ప్రేమ్ జీ, శివ నాడార్ , పల్లోంజీ మిస్త్రీ లు ఈ జాబితాలో ఉండటం విశేషం..
ఇక రాధాకిషన్ దమాని డీమార్ట్ వ్యాపారంలో వ్యవస్థీకృతం కాకముందు 1990 సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ , తద్వారా తన ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఈ స్టాక్ మార్కెట్ ద్వారా 1990 సంవత్సరం నుండి 2021 నాటికి ఈయన సంపద 4.3 బిలియన్ డాలర్ల విలువ పెరిగింది. ఇక డీమార్ట్ రంగంలోకి వచ్చిన ఈయన సూపర్ మార్ట్ ల ద్వారా మంచి లాభాలు పెరగడంతో ప్రస్తుతం దీని విలువ 32 శాతానికి పెరిగింది.
ఈయన సమయాన్ని ఎక్కువగా డీమార్ట్ వ్యాపార సంస్థల పై కేటాయించుకుంటున్నప్పటికీ స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ, అక్కడ కూడా దూసుకుపోతున్నారు. అంతేకాదు ఈ స్టాక్ మార్కెట్లో కలిగే ప్రయోజనాలేంటి..? ఎలా పెట్టుబడులు పెట్టాలి..? అనే వాటిని కూడా ఈయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంతేకాదు స్టాక్ ట్రేడింగ్ టెక్నిక్ లకు కావలసిన అన్ని అనుభవాలను కూడా ఈయన మీడియా ముందు తెలియజేయడం గమనార్హం..