అయితే ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ ను వశం చేసుకున్న తాలిబాన్ల...భారత్ కి ఎగుమతి,దిగుమతి ని ఆపేశారు.ఈ విషయాన్ని ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ తెలిపారు.ముఖ్యంగా ఎగుమతిలపై తాలిబన్లు నిషేధం విదించటంతో భారత దేశంలో అమాంతం డ్రైఫ్రూట్స్ ధరలు పెరిగిపోయాయి.అసలే ఇది కరోనా సమయం కావటంతో డాక్టర్లు డ్రైఫ్రూట్స్ ఎక్కవగా తీసుకోవాలని చెప్పటంతో వినియోగం బాగా పెరిగింది.ఇకపై ముందు ఉన్న రోజులు కూడా పండుగ సీజన్లో ఇంకా ఎంత పెరుగుతాయో???గత కొన్ని రోజులుగా ధరలు పెరగటంతో ఎఫ్ఐఈవో ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు దేశంలో పండగ సీజన్ మొదలవుతుండటంతో ఎండు ఫలాలకు గిరాకీ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్తకం దారులు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండు ఫలాల దిగుమతులు నిలిచిపోతే తమ వ్యాపారం దెబ్బతింటుందని ట్రేడర్లు ఆవేదన చెందుతున్నారు. అఫ్గాన్‌తో భారత్‌కు వాణిజ్యపరంగా మెరుగైనా సంబంధాలున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆ దేశం నుంచి భారత్ రూ.3,753 కోట్ల దిగుమతులు చేసుకోగా.. అందులో ఎండుఫలాల విలువ రూ.2,389కోట్లు కావడం గమనార్హం. అఫ్గాన్ నుంచి ఎక్కువగా ఎండు ద్రాక్ష, వాల్నట్స్, బాదం, అంజీర్, పైన్ నట్స్, పిస్తా, ఆప్రికాట్స్ వంటి డ్రైఫ్రూట్స్‌తో పాటు చెర్రీ, పుచ్చకాయ, వంటి పండ్లు భారత్‌కు దిగుమతి అవుతుంటాయి. ఇక ఇక్కడి నుంచి తేయాకు, కాఫీ, మిరియాలు, బొమ్మలు, పత్తి, చెప్పులు తదితర ఉత్పత్తులు ఆ దేశానికి ఎగుమతి అవుతుంటాయి. అంతే కాకుండా ఆఫ్గనిస్తాన్ ఆక్రమణకు ముందు కేజి ఇంగువ ధర 1000 రూపాయలు కాగా నేడు అ ధర 2500 ను దాటింది.దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయో....!!!