ధనవంతులు కావాలంటే అత్యంత కష్టమైన పనులు చేయాల్సిన అవసరం లేదు అంటుంటారు పెద్దలు. మెదడుకు పదును పెట్టి అందరికీ భిన్నంగా ఆలోచిస్తే మనకు అందుబాటులో ఉన్న వస్తువుల ద్వారానే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. చాలా మంది మేధావులు పెద్ద చదువులు చదివి విదేశాలకు వెళ్లి జీవితం మొత్తం మీద కోటి రూపాయలు కూడా సంపాదించలేదు. కానీ కొందరు పెద్ద చదువులు చదువుకోకుండానే విదేశాలకు వెళ్లకుండానే కోట్ల రూపాయలు సంపాదిస్తారు అలాంటివారిలో మనం చెప్పుకోబోయే ఒక కూలీ కొడుకు కూడా ఉన్నాడు.

కేరళకు చెందిన ముస్తఫా పిసి అనే వ్యక్తి కేవలం ఇడ్లీ, దోశ పిండి అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అంతే కాదు రెండు వేల కోట్ల టర్నోవర్ విలువైన iD ఫ్రెష్ ఫుడ్‌ కంపెనీని స్థాపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆరవ తరగతి కూడా పూర్తి చేయకుండా చదువు మానేసిన ముస్తఫా చిన్నతనంలో అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. పది రూపాయల జీతంతో ముస్తఫా కుటుంబం జీవనం సాగించేది. కొంచెం పెద్దయిన తర్వాత 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక చిన్న కిచెన్ లాంటి రూమ్ ఏర్పరుచుకున్నాడు. గ్రైండర్ మిక్సర్ వేయింగ్ మిషన్ తో ఇడ్లీ, దోశ పిండి తయారు చేసే అమ్మేవాడు. రోజుకు 100 ప్యాకెట్లు అమ్మడానికి అతనికి తొమ్మిది నెలల సమయం పట్టింది అంటే అతిశయోక్తి కాదు.

దాదాపు సంవత్సరం పాటు అతడు ఇదే రంగంలో ఉండి ముందుకు సాగాడు. ఆ విధంగా అతడు తన ఇడ్లీ పిండి కంపెనీని నెంబర్ వన్ కంపెనీ గా తీర్చిదిద్దాడు. ఇప్పుడు అతడు రోజుకి 15-60 వేల కిలోల ఫ్రెష్ ఇడ్లీ పిండిని విక్రయిస్తున్నాడు. అతని కంపెనీలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పలు ఫుడ్ స్టోర్స్, మెట్రో సిటీలలో ఆయన కంపెనీ తయారు చేసే ఇడ్లీ దోశ, పిండి అమ్ముడు పోతుంది. ఈ కంపెనీ వల్ల చాలా మంది ఉద్యోగులు రెడీమేడ్ తక్కువ ధరకే కొనుక్కొని వేడి వేడి ఇడ్లీ దోస వేసుకుని ఎంచక్కా తింటున్నారు. ఒకవైపు బీభత్సం గా లాభాలు సంపాదిస్తూనే మరోవైపు ప్రజలకు సేవ చేసినట్లు అవుతుంది. ఒక కూలి కొడుకు రూ.2,000 కోట్ల విలువైన కంపెనీకి యజమాని ఇవ్వడం నిజంగా ఒక అద్భుతమైనని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: