వ్యాపారమే జీవన విధానంగా బతికే మర్వాడీ కుటుంబంలో 1954న జన్మించి దమానీ, రాజస్థాన్ నుంచి ముంబైలో ధామాని కుటుంబం స్థిరపడింది. డిగ్రీ చదువుతున్న మొదటి సంవత్సరం చదువుతున్న సందర్భంలో తాను చదవేలనని పట్టుబట్టాడు. దీంతో ఇంట్లో వాళ్లు ధమాని చేత బాల్ బేరింగ్ బిజినెస్ పెట్టించారు. అయితే, ధమానీ 32 ఏళ్ల వయస్సులో ఆయన తండ్రి శివ్ దమానీ మరణించాడు. దీంతో అయిష్టంగానే తండ్రి స్థానంలో దమానీ స్టాక్ మార్కెట్‌లోకి వచ్చాడు. స్టాక్ మార్కెట్ అంటేనే కొనేవాళ్లు, అమ్మెవాళ్లతో గందరగోళంగా ఉంటుంది. ఎంతో ఆసక్తి పెడితే కానీ, స్టాక్ మార్కెట్ పై దృష్టి సారించలేం. కానీ దమానీ హడావుడి మధ్య నెమ్మదిగా వ్యవహరించే వాడు. కానీ, అక్కడున్న వాళ్లను గమనిస్తూ.. మార్కెట్ పల్స్‌ను మాత్రం బాగా అంచనా వేసేవాడు.
1992 స్కామ్ ద్వారా ఎక్కువగా తెలిసిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టిన సమయంలోనే రాధాకిషన్ దమానీ కూడా వచ్చారు. ఆ రోజుల్లో హర్షద్ మెహతాకు పోటీలో నిలిచింది రాధాకిషన్ దమానీనే. స్టాక్ మార్కెట్‌లో కెరీర్ ప్రారంభించినప్పుడే మరో బిగ్‌బుల్, స్టాక్ మార్కెట్ స్కామర్ హర్షద్ మెహతా కూడా స్కాక్ మార్కెట్‌లో అడుగు పెట్టాడు. తెర వెనుక మంత్రాంగం నడుపుతూ మార్కెట్‌ను పైకి లేపడంలో హర్షద్‌కి పెట్టింది పేరు. అతనికి పోటీగా మార్కెట్‌లో నిలిచింది ట్రిపుల్ ఆర్‌లో రాధాకిషన్ దమానీ మూల స్థంభం. ఆ రోజుల్లో హర్షద్‌కి పోటీగా రాధా కిషన్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, రాజ్ అనే ముగ్గురు ట్రిపుల్ ఆర్‌గా పోటీ ఇచ్చారు. అయితే వీళ్లపై ఎక్కువ సార్లు హర్షద్‌దే పై చేయి అయ్యింది. అయినా సరే పట్టు వదలకుండా పోటీలో నిలిచారంటే దానికి కారణం దమానీనే.
1992 నుంచి 1998 మధ్య రాధా కిషన దమానీ కొనుగోలు చేసిన కంపెనీ షేర్ల విలువ చాలా పెరిగిపోయాయి. వీఎస్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, సుందరం ఫైనాన్స్ ఇలా అన్ని కంపెనీల లాభాలు పెరిగిపోయాయి. బేర్ మార్కెట్‌ను అంచనా వేసి తక్కువ ధర షేర్లు కొన్ని లాంగ్‌టర్మ్‌లో భారీ లాభాలను పొందే ప్రణాళికలను సిద్దం చేశాడు. ఈ వ్యూహాలతో పదేళ్లు తిరిగే సరికి వందల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు ధమాని. తరువాత అప్నాబజార్‌ను 1998లో నెలకొల్పారు. అది నష్టాల పాలవుతున్న సమయంలో ఎలాగైనా లాభాలు సాధించాలని స్టాక్ మార్కెట్‌ను వదిలేశాడు.
డీమార్ట్ స్థాపించడంతో ఆయన విజయ పరంపర మొదలైంది. పదేళ్లలో వీటి సంఖ్య పదికి పెరిగింది. తరువాతి కాలంలో దేశవ్యాప్తంగా డీమార్ట్ ల సంఖ్య లక్షల్లోకి చేరింది. దీంతో ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరి ప్రపంచ కుబేరుల్లో 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ముఖేవ్ అంబానీ 57.9 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉంటే దమానీ 19.30 బిలియన్ డాలర్ల సందతో రెండో స్థానంలో ఉన్నారు.