మీరు చదువుతున్నది నిజమే... పెట్రోల్, డీజల్ లు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జి.ఎస్.టి) పరిధి లోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. జి.ఎస్.టి మండలి సమావేశానంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 45 వ జి.ఎస్.టి మండలి సమావేశంలో పాల్గోన్న సభ్యులెవ్వరు కూడా పెట్రోల్, డిజిల్ లను జి.ఎస్.టి పరిధిలో చేర్చాలని భావించలేదన్నారు.
పెట్రోల్, డిజిల్ లను జి.ఎస్.టి పరిధిలో కి రానున్నాయన్నది మీడియా సృష్టి అని పేర్కొన్నారు. జి.ఎస్.టి మండలి సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఇంధన ధరలను జి.ఎస్.టి పరిధిలోకి చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదన్నారు పెట్రోల్, డిజిల్ లు జి.ఎస్.టి పరిధిలోకి వస్తాయా? లేదా ? అన్న విషయం తేల్చాలని కేరళ రాష్ట్ర హైకోర్టు లేఖ రాసిందన్నారు. ఈ విషయమే అజెండాగా సమావేశం జరిగిందని కేంద్ర మంత్రి చెప్పారు. సమావేశపు వివరాలను కోర్టుకు తెలియజేసేందుకు ఒక ప్యానల్ నుఏర్పాటు చేసినట్లు సీతారామమన్ తెలిపారు.
ఈ ఏడాది జూన్ నెలలో కేరళ హైకోర్టులో పెట్రోల్, డిజిల్ విషయమై కోర్టుకు ఫిర్యాదు అందింది. దీనిని విచారణకు తీసుకున్న హైకోర్టు వాదనలు విని, వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రోజ రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధాన నగర్లో లీటరు పెట్రోలు ధర వంద రూపాయలుగా ఉంది. అదే విధంగా డీజలు ధర కూడా నిత్యం పెరుగుతూ ఉంది. పెట్రోలు ధరకు సమీపాన డీజిల్ ధర ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి, అంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ 41 ఒక్క సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిిగాయి. ఇంధనం ధరల ఆదాయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే పెట్రోల్, డిజిల్ లకు జి.ఎస్.టి పరిధి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు పలువురు ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు.