రాబోయేది పండుగల సీజన్, దీనితో భారత మార్కెట్ పై అనేక ఈ కామర్స్ సంస్థలు కన్నేశాయి. ఈ సీజన్ లో ఆయా సంస్థలకు అమ్మకాల పండుగ అనే చెప్పాలి. అందుకే అన్ని వర్గాల వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లు కూడా ఇస్తూ ఉంటాయి సంస్థలు. ప్రస్తుతం ఈ కామర్స్ లో బాగా ప్రాచుర్యంలో ఉన్నవాటిలో ముందున్నవి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బిగ్ బజార్ మొదలగున్నవి. తాజాగా ఈ సంస్థలు పండుగ సీజన్ కోసం కొత్త ఆఫర్లతో సిద్ధంగా ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే డిస్కౌంట్ ఇచ్చే తేదీలను ప్రకటించగా, అమెజాన్ నేడు ప్రకటించింది. అమెజాన్ ఈ సీజన్ లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని పలు తాత్కాలిక ఉద్యోగాలను కూడా ఇస్తుంది. అంటే ఈ సమయంలో అమెజాన్ కు వచ్చిన ఆర్డర్స్ ను ఆయా వినియోగదారులకు చేర్చడం వరకు అనేక బాధ్యతలు ఈ ఉద్యోగులు నెరవేర్చాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలు సీజన్ లో మాత్రమే ఉన్నప్పటికీ మిగిలిన సమయంలో ఇప్పటికే ఉన్నవారిని అమెజాన్ ఉపయోగించుకుంటుంది. దాదాపు ఈ సీజనల్ ఉద్యోగాలు ఒక లక్షా పదివేల వరకు ఇవ్వడానికి సంస్థ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ ఉద్యోగాలు హైదరాబాద్ సహా బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, పూణే, చెన్నై, లక్నో, కలకత్తా లాంటి నగరాలలో చేయాల్సి ఉంటుంది. అంటే అమెజాన్ నెట్ వర్క్ అసోసియేట్ గా మీరు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సంస్థ ఆర్డర్స్ తీసుకోవడం, వాటిని ప్యాక్ చేయడం, షిప్పింగ్ చేయడం, డెలివరీ వంటి వాటివరకు చేయాల్సి ఉంటుంది.

అమెజాన్ డెలివరీ పార్టనర్ గా చేరాలనే వారు అమెజాన్ ఫ్లెక్స్ అనే యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివలన రోజుకు 40 నుండి వంద ఆర్డర్స్ వరకు డెలివరీ చేయవచ్చు. అంటే దాదాపు గంటకు 120-140 రూ వరకు సంపాదించవచ్చు. ఇతర వివరాల కోసం సంస్థ వెబ్ సైట్ : https://flex.amazon.in/ లో చూడగలరు. ఇలా సంస్థ ప్రతి పండుగ సీజన్ లో డిస్కౌంట్స్ ప్రకటిస్తూనే ఉంటుంది, అప్పుడు ఆర్డర్స్ కూడా భారీగానే వస్తాయి. ఆ ఆర్డర్స్ అన్ని ఈ తాత్కాలిక ఉద్యోగుల ద్వారా వినియోగదారులకు డెలివరీ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: