అలా పెరిగిన సాంకేతికత ఎన్నో మార్పులకు లోనై నేడు మనిషి గాలిలో ప్రయాణిస్తున్నాడు, నీటిమీద, నీటిలో కూడా ప్రయాణిస్తున్నాడు, అలాగే ఆకాశ మార్గాన కూడా అంటే అంతరిక్ష యానాం కూడా చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నాడు అంటే ఒక్కొక్కటి కనిపెట్టే కొద్దీ ఒక్కొక్క రకంగా కాలుష్యం కూడా పెరుగుతూనే ఉంది. కవలలు కదా మరి. అలా అభివృద్ధి చెందిన సాంకేతికతతో కార్ల కు ప్రత్యేకత ఉంది. ఏడాదికో రకమైన కారును లేదా ఒక్కో దశాబ్దానికి ఒక్కో రకమైన కారును లేదా నేటి విద్యుత్ కారు లాంటివి అనేక రకాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే టాటా సంస్థ తయారుచేసిన మైక్రో ఎస్ యు వి పంచ్ కారును సరికొత్తగా అందుబాటులోకి తెచ్చింది.
దీని బుకింగ్ ఈ నెల 4 నుండి అధికారిక లేదా తదనుబంధ సంస్థల నుండి బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. మైక్రో ఎస్ యు వి ని కూడా అదే రోజున విడుదల చేయనుంది. బుకింగ్ కోసం ఎంత చెల్లించాలి అనేది తెలిసిరాలేదు. అయితే ఆ మోడల్ ఫీచర్స్ ను విడుదల చేసింది. భారత్ లో ఎస్ యు వి తరహా మొదళ్లకు బాగా డిమాండ్ ఉంది. మరో మోడల్ సెడాన్ కు దీటుగా ఈ మోడల్ అమ్మకాలు జరుగా జరుగుతున్నాయి. అందుకే ఈ తాజా మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో 7 అంగుళాల స్క్రీన్ ఉన్న డిస్ప్లే రానుంది. అన్ని ప్రాంతాలలో ప్రయాణాలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. స్పోర్టి త్రి స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఆల్ట్రోజ్ నుండి డీజిల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్ వంటి అనేక కొత్త ఫీచర్స్ ఇందులో రానున్నాయి. ఎక్కవ గ్రౌండ్ కియరెన్సు తో ఇగ్నీస్ కంటే పెద్దదిగా ఉండబోతున్నట్టు సమాచారం.