కరోనా సృష్టించిన ఆర్థిక విధ్వంసానికి ఆయా సంస్థలు కొత్తదారులు వెతుకుతూ వారివారి పరిస్థితులను చక్కదిద్దుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. అందుకే దేశీయంగా, అంతర్జాతీయంగా సంస్థల జట్టు కడుతుండటం లేదా విలీనాలు చూస్తున్నాం. తాజాగా భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ అమెరికా సంస్థతో జతకట్టడానికి సిద్ధం అయ్యింది. అమెరికాకు చెందిన జెయింట్ రిటైలర్ 7-ఎలెవెన్ ఇంక్ తో రిలయన్స్ రిటైల్ జత కట్టడానికి సిద్ధం అయ్యింది. దీనిలో బాగంగానే ముంబై లోని అంధేరా లో వీరిద్దరి భాగస్వామ్యంతో మొదటి 7-ఎలెవెన్ స్టోర్ ప్రారంభం కానుంది. అనంతరం గ్రేటర్ ముంబై సహా అనేక వాణిజ్య ప్రాంతాలలో తమ స్టోర్ లను విస్తరించనున్నారు.

అయితే రిలయన్స్ రిటైల్ లో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ విలీనం పై అమెజాన్ తో న్యాయ పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో రిలయన్స్ మరో అమెరికా సంస్థతో జతకట్టడంపై ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఒప్పందంతో రిలయన్స్ తన కొత్త జట్టు 7-ఎలెవెన్ వ్యాపార పద్దతిని అలవరచుకోనుంది. ఈ విషయంపై 7-ఎలెవెన్ అప్పుడే స్టాక్ ఎక్స్చేంజి కి సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా వినియోగదారులకు ఉత్తమమైన నాణ్యత కలిగిన వస్తువులను అందుబాటులోకి తేగలమని రిలయన్స్ సంస్థ తెలిపింది. అలాగే తాము కూడా రిలయన్స్ కు అనేక వ్యాపార పద్దతులను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని 7-ఎలెవెన్ తెలిపింది.

గతంలో ఇదే 7-ఎలెవెన్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ తో జట్టుకట్టాలని చూసింది. కానీ అది రద్దవటంతో రిలయన్స్ ఆ అవకాశాన్ని దక్కించుకుంది. గత రెండేళ్లుగా 7-ఎలెవెన్ సంస్థ భారత్ లో అడుగుపెట్టేందుకు చేస్తున్నప్పటికీ సరైన  దక్కక పోవడం వలన అది కుదరలేదు. ఫ్రాంచైజ్ కోసం చెల్లించాల్సిన రుసుము ఫ్యూచర్ చెల్లించలేకపోవడం తో ఆ ఒప్పందం రద్దు అయినట్టు తెలుస్తుంది.  ఇక ఫ్యూచర్ అనుబంధ సంస్థ ఫ్యూచర్ కూపన్స్ లో 2019 లో అమెజాన్ 49 శాతం వాటా కొనుగోలు చేయడంతో రిలయన్స్ తో ఫ్యూచర్ విలీనం కు కూడా ఆటంకాలు వచ్చి పడ్డాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: