అమెరికా రుణ నియంత్రణ(డెబిట్ సీలింగ్) కోసం చర్యలు చేపట్టడం మొదలుపెట్టింది. దీనికోసం ప్రపంచంలోనే విలువైన నాణేన్ని ముద్రించడానికి సిద్ధం అవుతుంది. దానివిలువ ట్రిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లో 75 లక్షల కోట్లన్నమాట. ఈ నాణేన్ని రుణ నియంత్రణ కోసం బైడెన్ తీసుకురాబోతున్నాడు. కానీ ఆయన ఆర్థిక నిపుణులు మాత్రం ఇది మంచి చర్యకాదు, దీనివలన అమెరికా కరెన్సీ విలువ పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయినా బైడెన్ సాహసం చేయడానికి సిద్ధపడుతున్నాడు. అక్కడి నిర్వచనం ప్రకారం, అమెరికా ట్రెజరీ బాండ్లను ఎంతవరకు సంపాదించాలి అనేదానిపై పెట్టబోయే నిబంధనే ఈ రుణ నియంత్రణ.

దీనిని వివిధ దేశంలో వివిధ ఆర్థిక కార్యకలాపాలకు వినియోగించ వచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇది విడుదల చేయాలి అంటే ప్రభుత్వ కాంగ్రెస్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. అలా కానీ పక్షంలో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవుతుందని వారు అంటున్నారు.  అమెరికా 1917లో ఈ తరహా రుణ నియంత్రణ ప్రవేశపెట్టింది. అప్పటి నుండి దీనిని 78 సార్లు పెంచుకుంటూ వచ్చారు. అంటే ప్రతిసారి దీని విలువ ఒకేవిధంగా ఉండదు, అప్పటి ఆర్థిక సంక్షోభాన్ని బట్టి దాని విలువ నిర్ణయిస్తారు. అందుకే ఇప్పటి విలువ ట్రిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం 22 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మొత్తాన్ని మరో 28.5 మిలియన్ డాలర్ల వరకు పెంచవచ్చు అనే అంచనాలు ఉన్నాయి.  

ప్రస్తుత బడ్జెట్ లో 2 ట్రిలియన్ డాలర్లు ఆదాయం తగ్గింది. అందువలన ట్రిలియన్ డాలర్ల విలువైన ఒక ప్లాటినం కాయిన్ ను ముద్రించాలని బైడెన్ ప్రభుత్వం కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్థికనిపుణులు అంటున్నారు.  గతంలో అంటే 2011లో దీనిని అడిగే హక్కు అధ్యక్షుడికి ఇస్తూ చట్టంలో మార్పులు చేశారు. ఈ ప్రకారంగా ఇతర లోహాలతో కాకుండా ప్లాటినం తో చేసిన నాణేనికి ఎంత విలువ అయినా ప్రభుత్వం నిర్ణయించవచ్చు. ఒక్కసారి దీనిని ముద్రించి ఖజానాలో పెట్టి దానిలోంచి మరో ట్రిలియన్ డాలర్లు బైడెన్ ప్రభుత్వం తీసుకోవచ్చు. అయితే ఈ విధానాన్ని గతంలో బైడెన్ స్వయంగా వ్యతిరేకించడం 2011 లోని ప్రభుత్వం లో చూశాము.

మరింత సమాచారం తెలుసుకోండి: