
ఈ ర్యాంకింగ్ కోసం సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 58 దేశాలలోని 750 సంస్థల నుండి 150000 ల మంది ఉద్యోగుల(ఫుల్&పార్ట్ టైం) నుండి సమాచారం సేకరించింది. అనంతరం ర్యాంకుల జాబితా సిద్ధం చేసింది. ఆయా ఉద్యోగుల నుండి ఆర్థిక ప్రణాళిక, జెండర్ సమానత్వం, సామజిక బాధ్యత, టేలెంట్ మెరుగుపరచడం లాంటి అనేక అంశాలపై ప్రశ్నలు అడిగి తెలుసుకుంది సంస్థ. ఇలాంటి సర్వే లు గతంలో ఉన్నాయో లేవో కానీ, ఇది ఉద్యోగస్తులకు బాగా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే తమకు అన్ని సౌకర్యాలు ఇస్తూ మంచిగా చూసుకుంటున్న సంస్థలో ఉద్యోగాలు వెతుక్కోవచ్చు. భారత్ లో ఉన్న సంస్థలలో కూడా ఆయా సంస్థలకు దీని ప్రకారం డిమాండ్ లేదా మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఇతర భారతీయ సంస్థలు బజాజ్ 215, యాక్సిస్ బ్యాంకు 215, ఇండియన్ బ్యాంకు 314, ఓ.ఎన్.జి.సి. 404, అమర్ రాజా గ్రూప్ 405, కోటక్ మహీంద్రా 415, బ్యాంకు అఫ్ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంకు అఫ్ బరోడా 496, ఎల్.ఐ.సి. 504, ఇన్ఫోసిస్ 588, టాటా గ్రూప్ 746 స్థానాలలో ఉన్నాయని ఫోబ్స్ తెలిపింది. దీనిని బట్టి ఆయా సంస్థలు తమ ఉద్యోగస్తులను ఏమేరకు జాగర్తగా చేసుకుంటున్నది బహిర్గతం అయిపోయింది. ఇక మీదట ఉద్యోగాలులు కూడా మంచి ర్యాంకులు ఉన్న సంస్థలకే ప్రాధాన్యత ఇవ్వవచ్చు కూడా.