కేంద్రప్రభుత్వం కరోనా సమయంలో నేర్పిన పాఠాలను క్షుణంగా పరిశీలించి, పేదలకు, చిన్న మధ్యతరగతి వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలను ప్రవేశపెట్టింది. ఇవి ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజనల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఎస్బిఐ సంస్థలో ఖాతాలు ఉన్నవారు కూడా ఈ తరహా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విషయాన్నీ సంస్థ స్వయంగా ప్రకటించింది. పై రెండింటిలో సురక్ష భీమా వలన ప్రమాదంలో భీమా సౌకర్యం లభిస్తుంది. ఇందులో సభ్యత్వం ఉన్న వ్యక్తికి అనుకోని పరిస్థితులలో మరణం సంభవిస్తే, ఆ మొత్తం నామినికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పధకంలో సభ్యులు ఏడాదికి 12రూపాయలు కడితే సరిపోతుంది, వయోపరిమితి 18 నుండి 70 వరకు ఉండవచ్చు.
ఇక ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ద్వారా పాలసీదారులను 2 లక్షల భీమా వర్తిస్తుంది. ఈ పధకంలో సభ్యుడు అనుకోని పరిస్థితులలో మరణానికి గురైతే నామినికి లేదా అతని కుటుంబ సభ్యులకు సంస్థ 2 లక్షల రూపాయలు అందిస్తుంది. దీనికోసం పాలసీదారులు ఏడాదికి 330 కట్టాల్సి ఉంటుంది. వయోపరిమితి 18 నుండి 50 ఏళ్ళు ఉంటుంది. ఒకవేళ ఎస్బిఐ లో ఖాతా ఉన్నవారు, ఆ ఖాతా నుండి సదరు మొత్తం తీసుకోవచ్చు అనే అనుమతి ఇస్తే గనుక ఆ ఖాతా నుండి 342 రూపాయలు బ్యాంకువారు కట్ చేసుకుంటారు. దీనిని ఆటో డెబిట్ అంటారు. ఈ రెండు ఆయా వయోపరిమితిని బట్టి దాదాపుగా అందరూ కట్టుకోవడానికి సౌలభ్యం ఉంది. అయితే దానిని ఎస్బిఐ తమ ఖాతా దారులకు కూడా ఈ విధంగా స్పష్టం చేసింది.