వ‌చ్చే నెల‌లో బ్యాంక్ లతో ప‌ని ఉందా.. అయితే ఇది కోస‌మే మిస్ కాకండి. న‌వంబ‌ర్ లో బ్యాంక్ ల కు భారీ గా సెల‌వు లు వ‌స్తున్నాయి. న‌వంబ‌ర్ లో సెల‌వులు ఎప్పుడు ఎప్పుడు వస్తున్నాయో తెలుసుకంటే ఆ యా రోజుల్లో మ‌నం బ్యాంక్ ల‌కు వెళ్ల‌కుండా మ‌న స‌మ‌యాన్ని వృథా కాకుండా చేసుకోవ‌చ్చు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి ఒక్క‌రికి బ్యాంక్ ల‌లో ఎదో ఒక ర‌కం గా ప‌నులు ఉంటాయి. దీంతో రోజుల త‌ర‌బ‌డి బ్యాంక్ ల చుట్టు తిర‌గాల్సి వ‌స్తుంది. అయితే బ్యాంక్ ల‌కు సెలువు లు ఉన్న స‌మయాల్లో కూడా బ్యాంక్ లకు వెళ్ల‌డం.. అక్క‌డ బ్యాంక్ లు మూసి ఉండ‌టం తో నిరాశతో వెన‌క్కి వ‌స్తుంటం. అయితే ఏయే రోజుల్లో బ్యాంక్ ల‌కు సెల‌వులు ఉన్నాయో తెలుసుకుంటే ఆయా రోజుల్లో మ‌నం బ్యాంక్ ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.



అయితే న‌వంబ‌ర్ లో మొత్తంగా 17 రోజులు బ్యాంక్ ల‌కు సెల‌వులు ఉండబోతున్నాయి. అయితే ఈ సెల‌వు దినాలు అన్ని రాష్ట్రాల‌కు సంబంధించిన‌ది కాదు. కొన్ని రాష్ట్రాల్లో ప్ర‌త్యేకంగా పండుగ‌లు ఉంటాయి కాబట్టి అక్క‌డ సెలవులు ఉంటాయి. అయితే మ‌న తెలుగు రాష్ట్రాల విష‌యానికి వస్తే న‌వంబ‌ర్ 4 న దీపావ‌ళి పండుగ వ‌స్తుంది. అలాగే 7 న ఆదివారం, 13న రెండో శ‌నివారం ఉన్నాయి. అలాగే 14 న ఆదివారం వ‌స్తున్నాయి. అలాగే 19 న గురు నాన‌క్  జ‌యంతి, కార్తిక పౌర్ణమి ఉన్నాయి. వీటి తో 27న సెకండ్ శనివారం 28న ఆదివారం వ‌స్తున్నాయి. ఈ రోజులలో రెండు తెలుగు రాష్ట్రాల‌లో అన్ని బ్యాంక్ ల‌కు సెలువు లు ఉంటున్నాయి. దీంతో ఆయా రోజుల్లో బ్యాంక్ లు మూసి ఉంటాయి. అయితే బ్యాంక్ లు మూసి ఉన్న ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సేవ‌లు మాత్రం అందుబాటు లోనే ఉంటాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: