కానీ కొన్ని సార్లు ప్రయత్నం చేస్తున్న వారిలో నిబద్దత ఉన్నప్పటికీ, వారి కాళ్ళు పట్టుకు లాగే దేశద్రోహుల వ్యూహాలకు కూడా అందకుండా ప్రణాళికలు వేసుకుపోతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం భారత్ కూడా అదే స్థితిలో ఉన్నాడని చెప్పడానికి సిగ్గుపడాల్సిన పనేమిలేదు. దేశద్రోహులు ప్రతిదేశంలో ఉంటారు, కానీ వాళ్లకు చిక్కకుండా ముందుకు వెళ్లడం అత్యవసరం. మరో ప్రభుత్వం అయితే అమ్ముడుపోయి, దేశాన్ని ఇప్పటికే అమ్మేసుకునేది కావచ్చుగాక, మొదటి నుండి దేశభక్తికి చిహ్నంగా ఉన్న ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం తన వంతు ప్రయత్నం, దేశాన్ని రక్షించుకోవడానికి తీవ్రంగా చేస్తుంది. అయినా కొన్ని ప్రతికూల పరిస్థితులు తప్పవు.
ఈ స్థితిని బట్టి దేశీయ మార్కెట్లు ఆధారపడతాయి కాబట్టి అందులో నేడు ఒడిదుడుకులు తప్పలేదు. ఇవన్నీ సహజమే అయినప్పటికీ,
నేడు మెటల్, బ్యాంకు లపై ఈ ప్రభావం బాగా పడింది. సెన్సెక్స్ 80 పాయింట్ల మేర నష్టపోగా, నిఫ్టీ 27 పాయింట్ల మేర నష్టపోయింది. ముఖ్యంగా ఇండస్ ఇండ్ బ్యాంకు 3 శాతానికి పైగా నష్టాలను చవిచూసింది. నేడు కూడా టెలికం, ఫార్మా లు కాస్త మెరుగ్గానే లాభించాయి. దీనితో నేడు మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 60352 వద్ద ఉండగా, నిఫ్టీ 18017 వద్ద ఉంది.