అంతర్జాతీయంగా అనేక మల్టీనేషనల్ సంస్థలకు ఇప్పటికే భారతసంతతి ప్రాధాన్యత వహిస్తున్న విషయం తెలిసిందే. గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పెప్సీ కో, మాస్టర్ కార్డు లాంటి అనేక సంస్థలకు భారతీయులే బోస్ లుగా ఉన్నారు. భారతీయులు ఎక్కడకు వెళ్లినా మొదటి నుండి ఈ ఆదరణ లభించడం గమనార్షం. కరోనా తరువాత ఈ స్థితి మరింత మెరుగుపడిందని చెప్పవచ్చు. దానికి అనుగుణంగానే మరికొంత మంది భారతీయ సంతతికి చెందిన వారు ఆయా ప్రముఖ సంస్థలకు అధినేతలుగా నియమితులవుతున్నారు. ఆ దారిలోనే తాజాగా ఫ్రాన్స్ కు చెందిన గ్లోబల్ లగ్జరీ ఫాషన్ సంస్థ 'చావెల్' కు భారత సంతతికి చెందిన లీనా నాయర్ ను సీఈఓ గా నియమించింది. ఈ సంస్థ ప్రపంచంలోనే టాప్ ఫాషన్ బ్రాండ్లలోనే ఒకటి. ఫ్రాన్స్ కి చెందిన ప్రముఖ బిలియనీర్ అలెన్ వెర్త్ మీర్ ఈ సంస్థను స్థాపించారు. దీని టర్నోవర్ ప్రతి ఏటా లక్ష కోట్లు ఉంటుంది.

లీనా ప్రస్తుతం లండన్ కేంద్రంగా ఉన్న యూనీలీవర్ సంస్థ లో చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ గా ఉన్నారు. జనవరి లో చావెల్ సీఈఓ బాధ్యతలు స్వీకరించనున్నారు. లీనా మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో పుట్టారు. ప్రాథమిక విద్య స్వగ్రామంలో పూర్తిచేసి, అనంతరం వాల్ చాంద్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. తరువాత జంషెడ్ పూర్ లోని జేవియర్ స్కూల్ అఫ్ మేనేజ్మెంట్ లో మేనేజ్మెంట్ డిగ్రీ(గోల్డ్ మెడల్) సాదించారు. అనంతరం 1992 నుండి యూనీలీవర్ లో మేనేజ్మెంట్ ట్రైనీ గా చేరారు. ఆ సంస్థలోనే పలు కీలక పదవులను ఆధిరోహించారు. భారత్ లోనే బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర లలోని యూనీలీవర్ యూనిట్లలో కూడా ఆమె విధులు నిర్వర్తించారు. 2016 నుండి లండన్ లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అలాగే ఓమ్నికామ్ మీడియా గ్రూప్ ఇండియా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మరో భారతీయ సంతతి(అనిషా అయ్యర్)కి పదవి లభించింది. అయ్యర్ కు డిజిటల్ టెక్ సహా వ్యాపారరంగంలో 18 ఏళ్ళ సుదీర్ఘమైన అనుభవం ఉంది. 2019లో ఆమె మలేషియా కు అనుబంధంగా ఉన్న ఓమ్నికామ్ మీడియా సంస్థలో చేరారు. గతంలో ఆమె మైండ్ షేర్, మ్యాడ్ హౌస్, గ్రూప్ కామ్ లలో విధులు నిర్వర్తించారు. ఎఫ్ ఎంసిజి, ఫార్మా, ఆటో, ట్రావెల్, టెలికాం, ఈ-కామర్స్, ఆహారం మరియు రిటైల్ వ్యాపారాలలో ఆమెకు గణనీయమైన అనుభవం ఉంది. ఓఎండి అనేది అంతర్జాతీయ మీడియా నెట్ వర్క్ యొక్క భారతీయ విభాగం. ఈ మీడియా గ్రూప్ లో ఓఎండి, హార్ట్ అండ్ సైన్స్, పీహెచ్ డి వంటి మీడియా ఏజెన్సీలు ఉన్నాయి. భారతీయ 2020 ప్రకటనల విలువ 564బిలియన్ గా ఉండగా, ఇది 2022నాటికి 700బిలియన్లు కాగలదని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: