
ఎన్ని ఎదురైనా కొత్తవాటిపై మోజు పడేవాళ్ళు కొంటునే ఉన్నారు. ఏమో గుర్రం ఎగరా వచ్చు అనే నానుడి ప్రకారంగా, ఈ కరెన్సీ రేపు గొప్ప ఫలితాలు ఇస్తే అనేది కూడా ఇక్కడ ప్రధాన కోణం. దాని వలన ఎక్కువ మంది అటు దృష్టి పెడుతూనే ఉన్నారు. కానీ కొందరు ఇంకా సెక్యూరిటీ ని బట్టే ఆయా వనరులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత్ కూడా అటువంటిదే అని చెప్పడంలో అతిశయోక్తి ఏమి లేదు. ఇటీవల ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ, దానిపై కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వస్తుంది ప్రభుత్వం. ఈ బిట్ కాయిన్ పై కూడా అదే విధంగా స్పందిస్తుంది. ఎవరో అగ్రరాజ్యం దీనిపై పెట్టుబడి పెడుతుందని, కళ్ళుమూసుకొని అటువైపు పరిగెత్తే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే భారత్ వ్యవహారశైలి ఉంటుంది.
ఎవరికో పెత్తనం ఇవ్వకుండా స్వతహాగా తనదైన శైలిలో ముందుకు పోతుంది భారత్. ఎన్నో దేశాలు క్రిప్టో కరెన్సీ పై మొగ్గు చూపుతున్నప్పటికీ, భారత నాయకులు మాత్రం దానికి వ్యతిరేకం అంటూ ఇప్పటీకే అంతర్జాతీయ వేదికలపై కూడా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు. అదే ఆలోచన ఇప్పుడు ఇతర దేశాలలో మొదలవుతుంది. తాజాగా ఆ దిశగా ఇంగ్లాండ్ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. బిట్ కాయిన్ అనేది విలువలేనిది, దాని వెంట పరిగెత్తడం ఆపాలని స్పష్టం చేసింది. భారత్ క్రిప్టో కరెన్సీ వైపు తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని ఆ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఈ విధానం వైపే పలు దేశాలు త్వరలో అడుగులు వేయనున్నట్టు తెలుస్తుంది. ఇలా బిట్ కాయిన్ ద్వారా వ్యతిరేక శక్తులకు ఆదాయం లభిస్తున్నదనే సంకేతాలు బహుశా బ్రిటన్ ఈ నిర్ణయానికి రావడానికి కారణం కావచ్చు. ఏది ఏమైనా, ఇలాంటి విధానాలవైపు ప్రజలు వెళ్లకుండా ఉంటేనే ఆయా వ్యతిరేక శక్తులకు బలం లభించకుండా ఉండగలదు. నమ్మకం పెట్టుబడి కావచ్చు, అది ఆయా సంస్థలలో పెట్టండి, ఖచ్చితంగా తిరిగి ఫలితం వస్తుంది. అంతే కానీ రూపాయి రూపాయి కూడబెట్టుకొని వీటిపై పోసి మోసపోకండి. జీవితాలను నాశనం చేసుకోకండి. ప్రభుత్వమే వద్దు అన్నదంటే , అది సరైన దారిలో లేదనేది గుర్తించండి. ప్రభుత్వం కూడా ఒక్కోసారి నిర్ణయాన్ని పరోక్షంగానే చెప్పగలదు అనేది గుర్తుపెట్టుకోగలరు. కొందరు ప్రపంచంలో ఎవరిమీదైనా ఒత్తిడి తెగలరు!