ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐ ఫోన్ల ఉత్పత్తి ఇక నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ సిటి ప్రత్యేక ఆర్థిక మండలిలో తయారు కానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 12 మోడల్ ఫోన్లు, ఇప్పటి వరకూ భారత దేశంలోని ఫాక్స్‌కాన్ ఐఫోన్ ఫ్యాక్టరీ లో తయారవుతున్నాయి. ఈ కర్మాగారం తమిళనాడులోని చెన్నై పారిశ్రామిక వాడలో ఉంది గత వారం పదిరోజుల క్రితం ఆ ఫ్యాక్టరీలో ఫుడ్ పాయిజనింగ్ జరిగిన కారణంగా 250 మందికి పైగా అస్వస్తులయ్యారు. కార్మికుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవడంతో పాటు, తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించింది. దీంతో ఫ్యాక్టరీ ని మూసివేశారు. క్షత గాత్రులను తమిళనాడు మంత్రులు, అధికారులు పరామర్శించారు. కాక పోతే ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికలపై తగినంత శ్రద్ధ వహించ లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాదాపు 17 వేల మంది ఉద్యోగులు పనిచేసే ఈ సంస్థలో కార్మికుల భద్రతకు సరైన చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం భావించింది. కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించాలని ప్రభుత్వం అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. స్థానికంగా ప్యాక్టరీ చెందిన బాధ్యులు కార్మికులతోనూ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నూ దఫాలు దఫాలుగా చర్చలు జరిపారు. డిసెంబర్ 27 వ తేదీ సోమవారం నుంచి ఫ్యాక్టరీని తెరిచేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది. కానీ వెయ్యి మంది కార్మికులు కూడా ఫ్యాక్టరీ వద్దకు రాలేదు. ఆ పరిసరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొద్ది పాటి వాహనాలు మినహా అక్కడ ఎలాంటి యాక్టివిటీ జరగ లేదు. దీంతో ఐ ఫోన్ ల తయారీ కి అడ్డంకులు ఏర్పడినట్లయింది. చెన్నైలోని ఫాక్స్‌కాన్ కర్మాగారంలో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఐ ఫోన్ సంస్థ భారత్ లోని వేరొక ప్రాంతంలో తమ ఉత్పత్తిని ఆరంభించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఫాక్స్ కాన్ కే చెందిన మరో కర్మాగారం ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ సిటీ సెజ్ లోఉంది. అక్కడ ఫాక్స్‌కాన్ ప్రస్తుతం చైనాకు చెందిన షియామి తోపాటు, పలు కంపెనీలకు చెందిన వివిధ మోడళ్లు తయారవుతున్నాయి. ప్రస్తతం డిమాండ్ అవసరాలను అధికమించేందుకు తాత్కాలికంగా నైనా ఐఫోన్ 12, ఐఫోన్ -13 మాడళ్లను శ్రీసిటీ పారిశ్రామిక వాడలో తయారు చేయారు చేసి ఐఫోన్ కంపెనీకి అందించాలని ఫాక్స్‌కాన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై రెండు మూడు వారాల్లో ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.