పూర్తి వివరాల్లోకి వెళితే..హైదరాబాదులో అడుగు ఒక కొబ్బరి బొండం షాప్ ఉంటుంది. వీటి నుండి పెద్ద సంఖ్యలో తాగి పడేసిన కొబ్బరిబోండం లు వస్తూ ఉంటాయి.ఈ తాగి పడేసిన బొండాలన్నీ జవహర్ నగర్ లో ఉన్న డంప్ యార్డ్ కి ప్రతి రోజూ జిహెచ్ఎంసీ తరలిస్తూ ఉంటుంది. అయితే హైదరాబాద్ కు చెందిన నాగరాజు అనే యువకుడు అందరికంటే చాలా భిన్నం గా ఆలోచించి తాగి పడేసిన బొండాలు తీసుకొచ్చి వాటితో వ్యాపారం చేస్తూ కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. నగరం లో తాగి పడేసిన బొండాలను సేకరించి వాటి నుంచి రకరకాల వస్తువులు తయారీకి ఉపయోగపడే ముడి సరుకును నాగరాజు తన సిబ్బందితో ఉత్పత్తి చేస్తున్నాడు. నగర శివార్లలో ఒక చిన్న ప్లాంట్ ని ఏర్పాటు చేసి.. తను ఉపాధి పొందడమే కాకుండా మరో 12 మందికి ఉపాధి కల్పించడంతోపాటు బొండాల నుంచి ముడి సరుకుని ఉత్పత్తి చేసి.. ఎంతోమంది యువతకు ఆదర్శం గా నిలుస్తున్నాడు. నగరం లో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మూడు టన్నుల ఖాళీ కొబ్బరి బొండాల నుంచి నిత్యం 50 శాతం పీచు, 50 శాతం కొబ్బరి ఎరువును తయారు చేస్తున్నాడు.
ఇక పీచు కొబ్బరికాయ పీచు, ఎరువు తో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చెయ్యడంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తూ.. ఆయన ఏడాదిలో కోట్ల రూపాయలను గడుస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.