దీని ఫలితంగా సంస్థ మార్కెట్ విలువ స్వల్పంగా తగ్గి 2.99 లక్షల కోట్ల డాలర్ల వద్ద నిలిచింది. 1980లో స్టాక్ మార్కెట్‌లో నమోదు అయినప్పుడు యాపిల్ మార్కెట్ విలువ రూ.180కోట్ల డాలర్లు మాత్రమే. 2018 ఆగస్టులో యాపిల్ మార్కెట్ విలువ 1లక్ష కోట్ల డాలర్ల మైలురాయికి చేరినది2020 ఆగస్టులో 2లక్షల కోట్ల డాలర్లను అందుకున్నది. మొదటి లక్ష కోట్ల డాలర్లను చేరడానికి యాపిల్‌కు 38 సంవత్సరాలు పట్టగా.. అక్కడి నుండి రెండవ మైలురాయికి 24 నెలలు పట్టింది. ఇక అప్పటి నుంచి 16 నెలల సైమయంలో మూడవ ఘనతకు చేరుకున్నది. ప్రపంచంలోనే అత్యధిక నగదు నిలువలు కలిగిన సంస్థ యాపిల్.
భారత ఐటీ సంస్థల వద్ద ఉన్న మొత్తం నగదు నిలువలు కలిపినా కూడా యాపిల్‌దే అధికం కావడం విశేషం. 15 ఏళ్ల కాలంలో 3 సార్లు మాత్రమే సంస్థ వార్షిక ప్రతిఫలం తక్కువగా ఉన్నది. యాపిల్ వేరబుల్స్ వ్యాపారం ఏడాదికి 20 శాతం చొప్పున వృద్ధిని సాధిస్తోంది. 186 దేశాల జీడీపీ విలువ కంటే యాపిల్ మార్కెట్ విలువ ఎక్కువ. కేవలం అమెరికా, చైనా, జపాన్, జర్మనీల జీడీపీ మాత్రమే యాపిల్ మార్కెట్ విలువ కన్నా ఎక్కువగా ఉన్నది. భారత జీడీపీ 2.62లక్షల కోట్ల డాలర్లు మాత్రమే. అయితే మార్కెట్ పరంగా చూసినట్టయితే యాపిల్ 3లక్షల కోట్ల డాలర్లు, మైక్రోసాప్ట్ 2.51లక్షల కోట్ల డాలర్లు, గూగుల్ ఆల్ఫాబెట్ 1.92 లక్షల కోట్ల డాలర్లు, సౌదీ అరామ్‌కో 1.9 లక్షల కోట్ల డాలర్లు, అమెజాన్ 1.73 లక్షల కోట్ల డాలర్లు ఉండడం గమనార్హం.