ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM-KISAN) లబ్ధిదారులు ఎవరైతే వున్నారో.. ఇక ఇక్కడ మీ కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ వుంది కాబట్టి ఖచ్చితంగా గమనించండి. మీరు PM-KISAN లబ్దిదారులు ఇంకా మీ స్టేటస్ ని కనుక చెక్ చేయాలనుకుంటే, మీరు కిసాన్ పోర్టల్‌లో ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చెయ్యడం తప్పనిసరిగా చేయాలి. గతంలో లబ్ధిదారులు తమ మొబైల్ నంబర్ వివరాలను ఫీడ్ చేయడం ద్వారా పిఎం కిసాన్ పోర్టల్‌లో అప్లై స్టేటస్ ఇంకా బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు జమ చేయబడింది వంటి వివరాలను ఈజీగా చెక్ చేయవచ్చు.
ఇక ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వెబ్సైట్ ద్వారా మీరు మీ పేరుని ఎలా చెక్ చేసుకోవాలో కింద వున్న దశల వారీగా చాలా ఈజీగా తెలుసుకోండి.
దశ 1: ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌ని ఓపెన్ చెయ్యండి..
దశ 2: ఓపెన్ చేసాక కుడి వైపున ఉన్న 'ఫార్మర్స్ కార్నర్'పై క్లిక్ చేయండి..
దశ 3: ఇప్పుడు ఆప్షన్ నుండి, బెనిఫిషియరీ స్టేటస్ క్లిక్ చేయండి..
4వ దశ: మీ స్టేటస్ చూడటానికి మీరు మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా ఇంకా అలాగే మీ మొబైల్ నంబర్ వంటి కొన్ని వివరాలను కీ చేయాలి..
దశ 5: మీరు పై విధానాన్ని పూర్తి చేసిన తర్వాత, లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో మీరు చూస్తారు..
మొబైల్ యాప్ ద్వారా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి?
ఇక మొబైల్ యాప్ ద్వారా మీ పేరును చెక్ చేసుకోవడానికి, మీరు ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం మొబైల్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు యాప్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత, మీకు అన్ని వివరాలకు యాక్సెస్ ఉంటుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 10వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 1న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయడం జరిగింది. కాబట్టి పైన పేర్కొన్న విధంగా మీరు చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు.