ఆధార్ కార్డు అనేది భార‌త‌దేశంలో ప్ర‌తీ ఒక్క‌రికీ ఎంతో కీల‌క‌మైంది.  ఇది ఒక ముఖ్య‌మైన డాక్యుమెంట్ అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ఏ ప‌ని కోసం వెళ్లినా త‌ప్ప‌నిస‌రి కావాల్సింది ఆధార్ కార్డు. బ్యాంకుల్లో, ఎమ్మార్వో కార్యాల‌యాల్లో ఇలా ఎక్క‌డైనా నిత్య‌జీవితంలో ఈ డాక్యుమెంట్ లేనిది ఏ ప‌ని జ‌ర‌గ‌డం లేదు. ఆధార్ కార్డును ఇత‌ర ముఖ్య‌మైన డాక్యుమెంట్ల‌న్నింటికీ అనుసంధానం కూడా చేస్తోంది. ప్ర‌భుత్వం ఆధార్ కార్డు అవ‌స‌రం ఇంత పెరుగుతున్న త‌రుణంలో మీరు ఎక్క‌డెక్క‌డ ఆధార్ కార్డు వాడుతున్నారు. అంత‌కు ముందు ఎక్క‌డ ఆధార్ కార్డు వాడార‌ని తెలుసునే విధంగా ప్ర‌జ‌ల‌కు యూఐడీఏఐ అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ది.

ఆధార్ కార్డును వినియోగించ‌డం పెరిగిన నేప‌థ్యంలో మోసాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఎప్ప‌టిక‌ప్పుడూ ఆధార్ హిస్టరీని చెక్ చేసుకుంటుండాల‌ని యూఐడీఏఐ సూచిస్తోంది. ఎక్క‌డ మీరు మీ ఆధార్ కార్డును వాడుతున్నారు..? ఏ డాక్యుమెంట్‌ల‌కు దీనిని లింక్ చేస్తున్నారో..? ఎప్ప‌టిక‌ప్పుడూ తెలుసుకుంటూ ఉండాల‌ని పేర్కొన్న‌ది. ఒక వేళ మీరు దీనిపై శ్ర‌ద్ధ తీసుకోక‌పోతే వేరే వాళ్లు మీ ఆధార్ కార్డు వాడ‌కాన్ని దుర్వినియోగం చేసే అవ‌కాశ‌మున్న‌ది. మీ ఆధార్ కార్డుతో మోసాలు చేసే ప్ర‌మాదం కూడా పొంచి ఉన్న‌ది.  ఈ త‌రుణంలో ఆధార్ కార్డు హిస్ట‌రీలని కూడా బ్యాంకు లావాదేవీల మాదిరిగా ఎప్ప‌టిక‌ప్పుడూ  ప‌రిశీలిస్తూ.. ఉండాలి.

ఆధార్ కార్డు హిస్ట‌రీని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

తొలుత ఆధార్ కార్డుకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ అయిన‌టువంటి uidai.gov.in కి వెళ్లి ఓపెన్ చేయాలి. 


ఇది ఓపెన్ చేసిన త‌రువాత ఇందులో  My aadhar option ను క్లిక్ చేయాలి.

అది క్లిక్ చేసిన త‌రువాత ఆధార్ స‌ర్వెసెస్ ఆప్ష‌న్‌కింద ఆధార్ అథెంటికేష‌న్ హిస్ట‌రీ వ‌స్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

 
అప్పుడు కొత్త విండో తెరుచుకుంటుంది. దానిలో మీ 12 అంకెలు క‌లిగిన ఆధార్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ న‌మోదు చేసి.. ఓటీపీ సెండ్‌పై క్లిక్ చేయాలి.


ఇక ఇప్పుడు మీ ఆధార్ కార్డుకు సంబంధించిన మొత్తం హిస్ట‌రీని డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. ఆ హిస్ట‌రీలో మీకు ఏదైనా అనుమానం ఉంటే.. వెంట‌నే స‌రిచేసుకోవ‌చ్చు.


ఇంకా ఎందుకు ఆల‌స్యం ఇప్పుడే ఇప్పుడే మీ ఆధార్ హిస్ట‌రీని చెక్ చేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: