హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఉత్పత్తి పోర్ట్ పోలియో కోసం కస్టమర్లకు రిటైల్ లోన్ సౌకర్యం అందించడానికి ప్రయివేటు రంగ యాక్సిస్ బ్యాంకుతో జతకట్టింది. 750 కంటే ఎక్కువ మంది డీలర్ల కంపెనీ నెట్‌వర్క్‌లో కస్టమర్లు ద్విచక్ర వాహన ఫైనాన్సింగ్ ను ఎంచుకోవచ్చు అని హీరో ఎలక్ట్రిక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందంతో కస్టర్లను ఎంతగానో మేలు జరుగుతుంది. హీరో నుంచి వివిధ వేరియంట్లలో ఎలక్ట్రిక్ స్కూటీలను తీసుకొచ్చింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ.75000లకు హీరో ఎలక్ట్రిక్ ఫొటాన్ హెచ్.ఎక్స్ రూ.66వేలు హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా హెచ్.ఎక్స్. డబుల్ బ్యాటరీ, రూ.56వేలకు హీరో ఎలక్ట్రిక్ ఆఫ్టిమా హెచ్.ఎక్స్ సింగిల్ బ్యాటరీని అందిస్తున్నది. గత నెలలోనే మహేంద్ర గ్రూపుతో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో వ్యూహాత్మక టై అప్‌ను ప్రకటించినది. ఈ భాగస్వామ్యంలో మహీంద్రా గ్రూపు పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి మధ్యప్రదేశ్ పితాంపూర్‌లోని ప్లాంట్‌లో హీరో ఎలక్ట్రిక్ బైకులు ఆఫ్టిమా ఎన్‌వైఎక్స్‌లను తయారు చేయనున్నట్టు రెండు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
ఈ సంవత్సరం చివరి వరకు ఒక మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలనే లక్ష్యం ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు డెలివరీ సొల్యూషన్స్ ప్రొవైడర్ స్టార్టప్ టర్టిల్ మొబిలిటితో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకున్నది. ఈ భాగస్వామ్యం కింద, హీరో ఎలక్ట్రిక్ స్టార్టప్ కంపెనీ టర్టిల్ మొబిలిటీకి 1,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిణీ చేస్తుంది. ఇది సరఫరా విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి 2021 రెండో త్రైమాసికంలో చేర్చబడింది. ఎలక్ట్రిక్ ప్రయివేటు గ్యారేజ్ యజమానులకు శిక్షణ ఇవ్వడానికి, వారి నెట్‌వర్క్‌ను ఎలక్ట్రిక్ వెహికిల్ సర్వీస్ సెంటర్‌లుగా ఉపయోగించుకోవడానికి భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా హీరో ఎలక్ట్రిక్ బిజినెస్ టూ బిజినెస్ టు కస్టమర్ల కోసం ఈ గ్యారేజీలను సులభతరం చేస్తుందని కంపెనీ పేర్కొంది.