ఇక ఈ రోజుల్లో ఉద్యోగాల కంటే కూడా వ్యాపారమే బెస్ట్ అని చాలా మంది అనుకుంటున్నారు. వ్యాపారం చేయాలంటే కాస్త పెట్టుబడి ఇంకా అలాగే ఓపిక ఉంటే సరిపోతుంది. ఇంకా కస్టమర్లని కాస్త ఇంప్రెస్ చేసి వ్యాపారం చేస్తే కచ్చితంగా మంచిగా రాబడి అనేది మీకు వస్తుంది.అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తున్నారా ? ఎలాంటి వ్యాపారం చెయ్యాలి అనేది మీకు తెలియడం లేదా..? అయితే మీకోసం ఈ సూపర్ బిజినెస్ ఐడియా.ఇక ఈ బిజినెస్ ఐడియా ని గనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మీకు డబ్బులు బాగా వస్తాయి. మరి ఇక ఈ బిజినెస్ ఐడియాకి సంబందించిన పూర్తి వివరాలులోకి వెళితే.. ఈ మధ్య కాలం లో చాలా మంది కూడా ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ చేసుకోవడానికి చాలా ఇష్ట పడుతున్నారు. అందువల్ల మీరు కూడా ఆన్లైన్ లో టిఫిన్ సర్వీస్ ను ప్రారంభించి మంచిగా సంపాదించుకోవచ్చు.మీరు ఉంటున్న ఇంటి నుండే మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు. దీని కోసం మరీ అంతగా పెట్టుబడి కూడా పెట్టనక్కర్లేదు.


 కేవలం 10 వేల వరకు మాత్రమే ఖర్చు పెట్టచ్చు. లేదంటే ఐదు వేల నుండి కూడా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. అయితే మీ చుట్టు పక్కల ఉన్న వాళ్లకి మీరు మీ వ్యాపారం గురించి బాగా తెలియజేయాలి. అలానే వాట్సాప్ ద్వారా మీరు వారి ఆర్డర్లు తీసుకుంటూ ఉండాలి.యూపీఐ పేమెంట్స్ ద్వారా అమౌంట్ ని పే చేసేలాగ ఏర్పాటు చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇక ఈ వ్యాపారం కోసం అయితే ఖచ్చితంగా ఒక వంట మాస్టర్ ఇంకా అదే విధంగా ఖచ్చితంగా డెలివరీ చేయడానికి టూ వీలర్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఆర్డర్స్ కనుక మీకు వస్తే.. వాటిని డెలివరీ చేయడానికి మీరు డెలివరీ బాయ్స్ ని ఏర్పాటు చేసుకోవాలి.అయితే మీరు మంచిగా రుచిగా క్వాలిటీ తో టిఫిన్స్ అందించాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీ బిజినెస్ క్లిక్ అయ్యి చాలా బాగుంది అంటే సాయంత్రం పూట స్నాక్స్ కూడా మీరు చేసి అమ్మచ్చు. ఇలా నెలకి 70 వేల నుంచి లక్ష వరకు కూడా చాలా ఈజీగా సంపాదించుకోవడానికి వీలు అవుతుంది.ఇంకెందుకు ఆలస్యం మరి. ఇంట్రెస్ట్ వున్న వారు ఈ బిజినెస్ స్టార్ట్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: