ఆధార్‌ని ఎలా వెరిఫై చెయ్యాలి?
1. ఫస్ట్ uidai వెబ్‌సైట్‌కి వెళ్లండి.www.uidai.gov.in.
2. ఆ వెబ్‌సైట్‌లో 'ఆధార్ సర్వీసెస్' కింద 'వెరిఫై ఆధార్ నంబర్'పై మీరు క్లిక్ చేయండి.ఇక ఇలా చేయడం వల్ల కొత్త పేజీ అనేది ఓపెన్ అవుతుంది.
3. ఇక ఆ కొత్త పేజీలో, మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్ ఇంకా అలాగే క్యాప్చా నమోదు చేయండి.
4. ఆధార్ నంబర్ నిజమైనదైతే, వెబ్‌సైట్ 'ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్' అనే మెసేజ్ ని మీకు చూపుతుంది. అలాగే ఇతర వివరాలు కూడా చూపబడతాయి. మీ వయస్సు, మీ రాష్ట్రం పేరు ఇంకా అలాగే మీ మొబైల్ నంబర్ చివరి మూడు అంకెలు వంటివి చూపబడతాయి.
5. అనేక ప్రయత్నాల తర్వాత కూడా, ఆధార్ కార్డ్ నంబర్ వెరిఫై కావడంలో విఫలమైతే, ఆధార్ కార్డ్ నంబర్ ఉనికిలో లేదని అర్థం. ఇక అప్పుడు మీరు అవసరమైన పత్రాలతో సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి.
6. మీ బయోమెట్రిక్‌లు మళ్లీ వెరిఫై చేయబడతాయి.ఇంకా అలాగే uidai డేటాబేస్‌లో నమోదు చేయబడతాయి. ఇక దీని కోసం, మీకు రూ. 25తో పాటు 18% చొప్పున GST కూడా విధించబడుతుంది. తరువాత మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయబడుతుంది.