ఆర్థిక సంవత్సరం 2022 – 2023 ఏప్రిల్ నెల నుండి ప్రారంభం కానున్న సందర్భంగా ... బ్యాంకింగ్ రంగానికి సంబంధించి పని దినాలు వివరాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ వివరాలు తెలుసుకోవడం వలన బ్యాంక్ కస్టమర్లకు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం లేకుండా చూసుకోవచ్చు. మొదటగా ఆర్ధిక సంవత్సరం ఆరంభం నెల ఏప్రిల్ విషయానికి వస్తే... ఈ నెలలో దేశ వ్యాప్తంగా ఆయా బ్యాంకులకు గాను మొత్తం 15 రోజులు సెలవులు ఉండబోతున్నాయి. వారాంతపు సెలవు, ఆయా రాష్ట్రాల్లో కార్యక్రమాలు, పండుగల ఆధారం చేసుకుని సెలవులను నిర్ణయించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మేరకు సెంట్రల్ బ్యాంకు ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులకు సంబందించిన నెలవారీ సెలవులను విడుదల చేయడం జరిగింది.
ఏప్రిల్‌లో బ్యాంకులకు మొత్తం 15 సెలవులు ఇవ్వనున్నారు. వీటిలో 6 వారాంతపు సెలవులు ఉండగా కొన్ని బ్యాంకులకు ఏప్రిల్ 1న సెలవు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 2 కూడా బ్యాంకులకు సెలవు ఇవ్వడం జరిగింది. అదే విధంగా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, సిరుల్, బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 4, 5 తేదీలలో బ్యాంకులకు సెలవులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ, వైశాఖి, చెరోబా, బిజు పండుగ, గుడ్ ఫ్రైడే, బెంగాలీ నూతన సంవత్సర దినోత్సవం, హిమాచల్ డే వంటి పలు పండుగల కారణంగా ఏప్రిల్ 14 నుంచి 16 వరకు బ్యాంకులకు వరుసగా రెండు రోజుల వరకు సెలవులు ఉన్నాయి.
ఏప్రిల్ 16వ తేదీ మూడో శనివారం కారణంగా యదావిధిగా బ్యాంకులకు సెలవు ఇవ్వడం జరిగింది. గరియా పూజ సందర్భంగా ఏప్రిల్ 21న బ్యాంక్ కు సెలవు. షాబ్-ఇ-ఖదర్ / జుమాత్-ఉల్-విదా కారణంగా ఏప్రిల్ 29న బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇక ఏప్రిల్ నెలలో వారాంతపు సెలవులు విషయానికి వస్తే... ఇందులో భాగంగా నాలుగు ఆదివారాలు ఏప్రిల్ 3, 10, 17, 24 తేదీలలో సెలవులు ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ లు పనిచేయవు. అలాగే ఏప్రిల్ 9 మరియు 23 బ్యాంక్ కు సెలవులు. అలాగే ఏప్రిల్ 1, 14, 15 తేదీలలో బ్యాంక్ లు క్లోజ్ చేసి ఉంటారు. ఈ బ్యాంక్ సెలవు దినాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ లావాదేవీలకు సంబందించిన ప్రణాళికను రూపొందించుకునే మీ పనులను చేసుకోవచ్చు.