నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) భారతదేశంలోని మంచి పదవీ విరమణ పథకాలలో ఒకటి. ఇది సెక్షన్ 80CCD (1B) కింద రూ. 50,000 అదనపు మినహాయింపును అందిస్తుంది. కాబట్టి, ఇది మీ పన్ను ప్రయోజనాలను పెంచుకోవడంలో మీకు సహాయపడుతుంది. ఏ వ్యక్తి అయిన eNPS ద్వారా NPS కింద పెన్షన్ ఖాతాను తెరవవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA)చే నియంత్రించబడుతుంది.


ఎన్‌పీఎస్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాలి. అలాగే, KYC మీ ఆధార్‌తో లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి OTP నెంబర్ ద్వారా చేయబడుతుంది. 60 ఏళ్ల వయస్సులో మెచ్యూర్ అయ్యే NPS, 70 ఏళ్ల వరకు కూడా పొడిగించబడుతుంది. అయినప్పటికీ, మెచ్యూరిటీ సమయంలో మీరు సేకరించిన కార్పస్‌లో 60% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. కార్పస్‌లో మిగిలిన 40% మొత్తాన్ని యాన్యుటీలో పెట్టుబడి పెట్టడం తప్పనిసరి.


NPS కి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?


దీనికి దరఖాస్తు చేసుకోవడానికి 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులు, టైర్-I (విత్ డ్రా లిమిట్స్ తో) అలాగే టైర్-II (విత్ డ్రా లిమిట్స్ లేవు) రెండింటిలోనూ NPS అకౌంట్ ను తెరవవచ్చు.


అకౌంట్ రకాలు

1. టైర్ I అనేది దీర్ఘకాలిక పొదుపు కోసం తప్పనిసరి ఖాతా.


2. టైర్ II అనేది ఎటువంటి నిష్క్రమణ లోడ్ లేకుండా NPSలో అందుబాటులో ఉన్న వివిధ పథకాల నుండి పెట్టుబడి పెట్టడానికి ఇంకా విత్ డ్రా చేసుకోడానికి మీకు సౌలభ్యాన్ని అందించే యాడ్-ఆన్ అకౌంట్.


NPS అకౌంట్ ని ఎలా ఓపెన్ చెయ్యాలో ఇక్కడ ఉంది:


దశ 1: NSDL పోర్టల్‌ని సందర్శించి, రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి


దశ 2: మీ ఆధార్ లేదా పాన్ వివరాలను నమోదు చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది.


దశ 3: ఆపై మీరు తెరవాలనుకుంటున్న అకౌంట్ రకాన్ని ఎంచుకోండి.


దశ 4: ప్రాసెస్ ని పూర్తిగా ఆన్‌లైన్‌లో పూర్తి చేయడానికి మీ గుర్తింపు పత్రంగా ఆధార్‌ను ఎంచుకోండి.


దశ 5: ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలను పూరించండి. ఇంకా మీ రసీదు సంఖ్యను రూపొందించడానికి సబ్మిట్ పై క్లిక్ చేయండి.


దశ 6: కీలకమైన భాగమైన ఏదైనా ఏడు పెన్షన్ ఫండ్ల నుండి ఎంచుకోండి. మీరు పెట్టుబడి మోడ్‌ను కూడా ఎంచుకోవాలి ఇంకా మీ నామినీలను కేటాయించాలి.


దశ 7: తర్వాత ఫోటోగ్రాఫ్ ఇంకా సంతకాన్ని అప్‌లోడ్ చేసి, చెల్లింపు చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

NPS