కానీ ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా తమ వినియోగదారుల కోసం క్రెడిట్ కార్డు ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీంతో ఖాతాలో డబ్బులు లేకపోయినా వినియోగదారులు ఇక క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు వినియోగించుకోవడం ఆ తర్వాత డబ్బులు కట్టడం లాంటివి వాటికి అవకాశం ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రతి ఒక్కరూ తమ అవసరాలకనుగుణంగా క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ ఉపయోగించుకుంటున్నారు. ఇక అదే సమయంలో అటు కొన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు రెచ్చిపోతూ అధిక జరిమానాలు విధించడం.. ఇక బాకీలు వసూళ్లపై కస్టమర్ల పై వేధింపులకు పాల్పడడం లాంటివి చేస్తున్నాయి
కొన్ని కొన్ని సార్లు కస్టమర్లకు సమ్మతి లేకుండానే ఒత్తిడి చేసి మరీ క్రెడిట్ కార్డు ఇవ్వడం.. ఎలాంటి అనుమతి లేకుండానే అప్గ్రేడ్ చేయడం లాంటివి చేస్తున్నాయి క్రెడిట్ కార్డు కంపెనీలు. ఇటీవలే ఈ విషయంపై bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. సమ్మతి లేకుండా క్రెడిట్ కార్డు ఇవ్వడం లేదా అప్గ్రేడ్ చేయడం లాంటివి చేయవద్దు అంటూ ఆదేశించింది. ఒక వేళ ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తే కస్టమర్ కు వేసిన బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా బాకీలు వసూలు కోసం కస్టమర్ల పై క్రెడిట్ కార్డు కంపెనీలు వేధింపులు బెదిరింపులకు దిగకూడదు అంటూ ఆర్బిఐ స్పష్టం చేసింది. జూన్ ఒకటవ తేదీనుంచి ఇక ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి అని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.