ఇక ఈ రోజుల్లో చాలా మంది కూడా క్రిప్టో కరెన్సీల్లో ఇన్వస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత వీటిపై చాలా ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. ఈజీ మనీ కోసం చాలా మంది కూడా వీటిని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇక ఆదరణకు తగినట్లుగానే విమర్శలూ కూడా వీటిపై ఉన్నాయి. బిలియనీర్లు కూడా వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపటం లేదు. అలాగే గతంలో బిట్ కాయిన్ గురించి ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అనాసక్తి కనబరిచిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు అమెరికన్ వ్యాపార దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఇదే తరహాలో స్పందించారు. ఆస్క్ మీ ఎనీథింగ్ కార్యక్రమంలో ఒక యూజర్ క్రిప్టో కరెన్సీలపై అడిగిన ప్రశ్నకు బిల్ గేట్స్ బదులిచ్చారు. ఆయన క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయలేదని..ఎందుకంటే అవి విలువ లేని పెట్టుబడులను ఆయన అన్నారు. ఇతర పెట్టుబడుల్లాగా క్రిప్టోలు ఉండవని.. ఎవరో నిర్ణయించిన రేటుకు కొనటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. ఇక ప్రజలు దాన్ని చూస్తున్న తీరును తాను పరిగణలోకి తీసుకోనని కూడా అన్నారు.



ఏదైనా కంపెనీ విలువ అది తయారు చేసే ఉత్పత్తులు ఇంకా సేవలపై ఆదారపడి ఉంటుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.అలాగే గతంలో క్రిప్టోలపై స్పందిస్తూ.. ప్రపంచంలో ఉన్న మెుత్తం బిట్ కాయిన్లు ఇచ్చినా తాను వాటికి 25 డాలర్లకు కూడా కొనబోనని ఆయన అన్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని గేట్స్ అన్నారు. దీనికి బదులుగా తాను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తానని ఆయన అన్నారు. పెట్టుబడుల గురించి తెలిసిన చాలా మంది కూడా క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు నిజంగా ఆసక్తి చూపటం లేదు. ఎందుకంటే వాటిలో ఉండే రిస్క్ చాలా ఎక్కువ ఇంకా అమాంతం పెట్టుబడి విలువ ఒక్కోసారి సున్నాకు చేరే ప్రమాదం కూడా ఉంటుందని వారికి తెలుసు. పైగా వీటిపై నియంత్రణ లేక పోవటం వల్ల అనేక రకాల మోసాలు కూడా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: