ఇక అత్యవసర ఆర్థిక పరిస్థితులలో రూణాలు కావాల్సిన వారు బ్యాంకులు లేదా ప్రైవేటు రుణ సంస్థలను ఎక్కువగా సంప్రదిస్తారు.అలాగే టెక్నాలజీ కూడా మారుతున్న కొద్ది ప్రస్తుతం లోన్‌లు ఇచ్చే యాప్‌లో మార్కెట్లో చాలా పుట్టుకొచ్చాయి. ఇక వినియోగదారుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా డిజిటల్ పద్ధతిలో KYC పూర్తిచేసి అత్యవసర రూణాలను కొన్ని యాప్‌లు అందిస్తున్నాయి. ఇప్పటికే లోన్ కావాల్సిన వారు ప్రత్యక్ష్యంగా బ్యాంకులు లేదా ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలను సంప్రదించకుండా స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ రకమైన లోన్ పొందుతున్నారు. చాలా కంపెనీలు కూడా యాప్‌ల ద్వారా అనేక రకాల లోన్‌లు మంజూరు చేస్తున్నాయి.అయితే ఇప్పుడు ఈ జాబితాలో మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా చేరింది.ఇక ఇంతకుమందే ఆర్థిక లావాదేవీల(UPI ట్రాన్స్‌ఫర్)కు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన వాట్సాప్ వినియోగదారులకు మరింత చేరువకావడానికి కొత్తగా ఈ లోన్‌లు మంజూరు చేసే కొత్త ఆప్షన్‌ను కూడా తెచ్చింది. వాట్సాప్ గేట్‌వే ద్వారా పేమెంట్‌లకు అనుమతించిన విధంగానే ప్రముఖ క్రెడిట్ సంస్థ CASHe తరపున whatsapp ప్రత్యేక క్రెడిట్ ఫీచర్‌ను కూడా ప్రారంభించింది.


ఇది బిజినెస్ వినియోగదారులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బిజినెస్ కేటగిరి వారు కేవలం 30 సెకన్లలో ఈజీగా రుణాన్ని పొందవచ్చు. అయితే దీనికి ఎలాంటి పత్రాలు కూడా అవసరం లేదు.ఇక whatsapp CASHe ద్వారా లోన్ పొందడానికి వినియోగదారులు ఫోన్‌లో +91 80975 53191 నంబర్‌ను సేవ్ చేయాలి. ఆ తరువాత whatsapp చాట్ బాక్స్‌కి వెళ్లి HIఅని టైప్ చేయాలి. మెసేజ్ అనేది సెండ్ అయ్యాక ముందస్తుగా ఆమోదించబడిన లోన్‌కు సంబంధించిన వివరాలు కూడా వస్తాయి. ఇది మొత్తం కూడా AI-ఆధారితమైనది. మొత్తం 24 గంటలు పనిచేస్తుంది. అయితే రెగ్యులర్‌గా జీతాలు తీసుకునే వారు మాత్రమే ఈ లోన్‌కు అర్హులు. AI- పవర్డ్ మోడ్ ద్వారా KYC వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. మీకు ఉన్నటువంటి క్రెడిట్ స్కోర్ ఆధారంగా గరిష్టంగా రుణం ఎంత అందించబడుతుంది అనే వివరాలు కూడా ఇందులో తెలియజేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: