ఇక ఇండియాలో ఉద్యోగం చేసే దాదాపు అందరికి కూడా ఖచ్చితంగా పీఎఫ్‌ అకౌంట్ అనేది ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయినా కూడా అతను పీఎఫ్‌ అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.కానీ ప్రైవేట్‌ ఉద్యోగికి మాత్రం కంపెనీ మారితే ఖచ్చితంగా పీఎఫ్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాల్సిందే. గతంలో అయితే ఈ పీఎఫ్‌ బదిలీకి చాలా పెద్ద తతంగం ఉండేది.. వారు అప్పుడు ఖచ్చితంగా పీఎఫ్‌ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంత కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు.. అయితే చాలా మందికి కూడా ఆన్‌లైన్‌లో పీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడం అస్సలు తెలియదు. ఒకవేళ ట్రై చేసిన చుక్కలు కనపడతాయి. ఇక పీఎఫ్‌ అకౌంట్‌ ఎలా బదిలీ చేసుకోవచ్చో స్టెప్‌ బై స్టెప్‌ ఇప్పుడు మనం చూద్దాం…


Step 1: ముందుగా నెట్‌ ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌కు మీరు వెళ్లాలి. అక్కడ సర్వీసెస్‌లో ఎంప్లాయిస్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్‌ ఆన్‌లైన్‌ సర్వీస్‌పై మీరు క్లిక్‌ చేయాలి. అప్పుడు యూఏఎన్‌ నెంబర్‌ ఇంకా అలాగే పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి.

Step 2: ఇక లాగిన్‌ అయిన తర్వాత ఆన్‌లైన్‌ సర్వీస్‌పై కర్సర్‌ పెట్టగా అక్కడు ట్రాన్స్‌ఫర్‌ రిక్వెస్ట్‌ అనేది మీకు కనిపిస్తుంది. ఇక దానిపై మీరు క్లిక్‌ చేయాలి.

Step 3: ఆ తరువాత వ్యక్తిగత వివరాలు మీరు సరిచూసుకోవాలి. ఆ తర్వాత ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ వివరాలు మీరు నమోదు చేయాలి.

Step 4: ఇక అభ్యర్థులు మునుపటి ఉద్యోగానికి సంబంధించిన PF ఖాతా కనిపించే ‘వివరాలను పొందండి’ ఎంపికపై కూడా క్లిక్ చేయాలి.

Step 5: అలాగే EPFO సభ్యులు ఇప్పుడు ఫారమ్‌ను ధృవీకరించడానికి మునుపటి యజమాని లేదా ప్రస్తుత యజమాని ఎంపికలను ఎంచుకోవాలి.

Step 6: అలాగే UAN నమోదిత మొబైల్ నంబర్‌లో OTPని స్వీకరించడానికి సభ్యులు ‘గెట్ OTP’ ఎంపికపై క్లిక్ చేయాలి.

Step 7: ఇక చివరగా, EPFO సభ్యులు OTPని నమోదు చేసి సబ్మిట్‌ బటన్ పై క్లిక్ చేయాలి.

ఈ విధంగా మీరు ఈజీగా పైన తెలిపిన దశల ప్రకారం ఆన్లైన్ లోనే పిఎఫ్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: