
అయితే తాను ఇన్ని సంవత్సరాల పాటు పది నిర్మించిన వేళా కోట్ల వ్యాపార సంస్థనుండి పక్కకు తప్పుకుని తన వారసులకు పగ్గాలు అందించే రోజు కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. ఆ ప్లాన్ లో భాగంగానే ఇటీవల రిలయన్స్ జియో కంపెనీకి చైర్మన్ గా తన కొడుకు ఆకాష్ అంబానీని నియమించారు. తర్వాత తన ముద్దుల కూతురు ఇషా అంబానీని కూడా రిలయన్స్ రిటైల్ విభగానికి అధిపతిని చేయనున్నాడు. మరి ఈ శుభ సూచకం మరెప్పుడో అన్నది ఇంకొన్ని గంటల్లోనే తెలియనుంది.
అయితే ఈ వార్తలు విన్న వ్యాపారాధిపతులు అంతా ముఖేష్ అంబానీ ఇక రెస్ట్ తీసుకోనున్నాడు. మనకు కాంపిటీషన్ తగ్గుతుంది అనుకుని సంతోషంలో మునిగి తేలుతున్నారు. మరి తండ్రికి తగ్గ బిడ్డలు అని వీరు అనిపించుకుంటారా లేదా అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వారి పనితీరును చూడాల్సిందే . అయితే బాధ్యతలు వారికీ అప్పగించినా తన దృష్టి అంతా వ్యాపారం మీదనే ఉంటుంది అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.