పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో రకాల స్కీమ్ లు అందుబాటు లో ఉన్నాయి. అందులో కొన్ని మాత్రం ప్రజాదరణ పొందాయి.డిపాజిట్ పూర్తిగా సురక్షితంగా ఉండటమే కాకుండా గ్యారెంటీ రిటర్న్‌ అందిస్తాయి. పెట్టుబడుల పై మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు. పోస్టాఫీసు అనేక రకాల డిపాజిట్ పథకాల ను అందిస్తుంది. ఇందులో పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)ఒకటి. ఇందులో అత్యధిక వడ్డీ చెల్లిస్తోంది. ఈ స్కీమ్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.


మీరు సీనియర్ సిటిజన్స్ స్కీమ్‌ లో ఒకేసారి రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదికి 7.4 శాతం (కంపౌండింగ్) వడ్డీ రేటు తో 5 సంవత్సరాల తర్వాత అంటే మెచ్యూరిటీపై మొత్తం రూ. 6,85,000 అవుతుంది. ఇక్కడ మీరు వడ్డీగా రూ. 1,85,000 ప్రయోజనం పొందుతున్నారు. అంతే ప్రతి త్రైమాసిక వడ్డీ రూ.9,250 అవుతుంది. పోస్టాఫీసు వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ పథకం పై వార్షిక వడ్డీ 7.4% ఉంటుంది.


అయితే ఈ పథకం పూర్తీ కాలం 5 ఏళ్ళు..రూ.1000 గుణింతా ల్లో డిపాజిట్లు చేయవచ్చు. అలాగే ఇందులో గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఏక మొత్తం లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. SCSS కింద 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి ఖాతా ను తెరవవచ్చు. ఎవరైనా 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండి 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే అంటే VRS తీసుకున్నట్ల యితే అతను SCSSలో ఖాతా ను తెరవవచ్చు.. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తం రిటైర్మెంట్ ప్రయోజనాల మొత్తాన్ని మించకూడదు. 1 లక్ష కంటే తక్కువ మొత్తం తో, ఖాతాను నగదు రూపంలో తెరవవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ..చెక్కును చెక్ లను వాడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: