సోషల్
మీడియా వచ్చాకా ఎన్నో రకరకాల వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వార్తలు నిజమైనవి ఉంటాయి.. కొన్ని వార్తలు ఫేక్ ఉంటాయి. అయితే ఎక్కువ వైరల్ అయ్యేవి ఫేక్ న్యూస్‌లు అనే చెప్పాలి.ఇక తాజాగా అలాంటి ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో అమ్మాయిలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి
కేంద్ర ప్రభుత్వం వారికి 1.50 లక్షల రూపాయలు అందిస్తోందని దీని సారాంశం. ఈ మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో పాటు కొన్ని
యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఇదే వాదనను వినిపించాయి. మీరు కూడా ఈ వైరల్ సందేశాన్ని చూసినట్లయితే, ఈ క్లెయిమ్‌ను విశ్వసించే ముందు అసలు నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ మెసేజ్‌పై నిజనిర్ధారణ చేసింది.
ప్రధాన మంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పేరుతో ప్రభుత్వం నిజంగా ఏదైనా పథకాన్ని ప్రారంభించిందో లేదో తెలుసుకోండి.జానాలను తప్పుదారి పట్టించే వార్తల నుండి రక్షించడానికి ప్రభుత్వ
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వార్తలను వాస్తవికంగా
చెక్ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పీఐబీ అధికారిక
ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.
'పీఎం కన్యా ఆశీర్వాద్ యోజన' పేరుతో
కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయడం లేదని పీఐబీ తన ట్వీట్‌లో పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇది పూర్తిగా ఫేక్. అలాంటి సందేశాల ముసుగులో పడి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చెయ్యొద్దని హెచ్చరించింది.మీరు వైరల్ మెసేజ్ ని కూడా అనుమానించినట్లయితే, మీరు దాని వాస్తవాన్ని
చెక్ చేయాలనుకుంటే పీఐబీ ద్వారా తెలుసుకోవచ్చు. దీని కోసం, మీరు దాని అధికారిక లింక్ ను సందర్శించడం ద్వారా మీ వార్తల వాస్తవాన్ని
చెక్ చేయవచ్చు. అదే సమయంలో మీకు కావాలంటే మీరు దాని వాట్సాప్ నెంబర్ 8799711259 లేదా ఇమెయిల్ ఐడి కి మెయిల్ చేయడం ద్వారా చేసిన ఇలాంటి ఫేక్ స్కీమ్‌ల గురించి
చెక్ చేసి వివరాలు పొందవచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా పథకానికి దరఖాస్తు చేసే ముందు దాని గురించి పూర్తి సమాచారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి. మీరు ఇలా చేయకపోతే, మీరు సైబర్ మోసానికి గురవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.