ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు మంచి శుభవార్తని అందించింది. ఇక మీరు కనుక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  రూపే క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటే..మీకు కొత్త సర్వీసులు అనేవి అందుబాటులోకి వచ్చాయి. భీమ్ యాప్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డును మీరు లింక్ చేసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) భీమ్ యాప్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు వారి రూపే క్రెడిట్ కార్డును భీమ్ యాప్‌తో ఈజీగా లింక్ చేసుకోవచ్చు. తర్వాత కిరాణా స్టోర్స్‌లో మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చాలా ఈజీగా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చెయ్యొచ్చు. అసలు జేబులో కార్డు ఉండాల్సిన పని లేదు. ఫోన్ ద్వారానే క్రెడిట్ కార్డు నుంచి చెల్లింపులు చెయ్యొచ్చు.అయితే ఇప్పటి వరకు కూడా కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా ఇండియన్ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉండేది. భీమ్ యాప్‌తో ఆ బ్యాంక్ కస్టమర్లు వారి రూపే క్రెడిట్ కార్డును లింక్ చేసుకునే వారు. ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు కూడా వారి రూపే క్రెడిట్ కార్డును భీమ్ యాప్‌తో చాలా ఈజీగా లింక్ చేసుకోవచ్చు.అంటే ఇప్పటి దాకా చూస్తే నాలుగు బ్యాంకులు భీమ్ యాప్‌లో క్రెడిట్ కార్డు లింక్ సర్వీసులు అందిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డును ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ముందుగా మీరు భీమ్ యాప్‌లోకి వెళ్లాలి. తర్వాత లింక్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.ఆ తర్వాత ప్లస్ గుర్తుపై క్లిక్ చేయాలి. ఇక ఇప్పుడు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి బ్యాంక్ అకౌంట్, మరొకటి క్రెడిట్ కార్డు. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి.ఆ తర్వాత క్రెడిట్ కార్డు లింక్ అవుతుంది. ఇప్పుడు కార్డు చివరి ఆరు అంకెలని మీరు ఎంటర్ చేయాలి.ఆ తర్వాత వాలిడిటీ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఆ తరువాత యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రెడిట్ కార్డు భీమ్ యాప్‌తో ఈజీగా లింక్ అవుతుంది. తర్వాత కిరాణా స్టోర్స్ లేదా రిటైల్ స్టోర్స్‌లో షాపింగ్ చేసిన తర్వాత బిల్లు చెల్లింపు సమయంలో అక్కడి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చెయ్యొచ్చు. ఇలా క్రెడిట్ కార్డు లేకపోయినా కూడా చాలా ఈజీగా ఈజీగా షాపింగ్ చేయొచ్చు.అయితే మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: