ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ ప్రమాదాల్లో చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతుండటంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. అందువల్ల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఇక పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే వారికి ఆర్థిక భరోసా అందించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యెజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రయివేటు కంపెనీలో బీమా తీసుకోవాలంటే ప్రీమియం ఎక్కువుగా ఉంటుంది. దీంతో చాలా మంది కూడా బీమా తీసుకోరు. అలాంటి వారి కోసం అతితక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా చేయించుకునే ఛాన్స్ కేంద్రప్రభుత్వం కల్పిస్తోంది.ఈ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద చేరే వ్యక్తి సంవత్సరానికి కేవలం రూ. 20 డిపాజిట్ చేయడం ద్వారా రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనాలను ఈజీగా పొందవచ్చు.


ఇంకా ఈ పథకంలో చేరే వ్యక్తులు బ్యాంకులో సేవింగ్ అకౌంట్ కలిగి ఉండాలి. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అఫీషియల్ వెబ్ సైట్ లేదా ఇక్కడ లింక్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా వెబ్ సైట్ ని ఓపెన్ చేసి ఈపథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారం పొందవచ్చు. ఆ అప్లికేషన్ లో తెలిపిన వివరాలు పూర్తిచేసి, అవసరమైన డాక్యుమెంట్లని యాడ్ చేసి బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్కీం కోసం అకౌంట్ లోనుంచి రూ.20 తీసుకుంటారు.18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ స్కీం కి అర్హులు. ఈ స్కీంలో లబ్ధిదారులు ఎవరైనా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మృతుడి కుటుంబ సభ్యులకు రూ.2,00,000 ఆర్థిక సాయం అందుతుంది. ఒకవేళ ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.లక్ష ఆర్థిక సాయం లభిస్తుంది. బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారు ఈ స్కీంలో చేరొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: