సాధారణంగా ఇప్పటివరకు చాలామంది ఏకంగా తేనెటీగలు పెట్టిన తేనెతెట్టే నుండి తేనెను తీసుకోవడం లాంటివి చూశాము. ఏకంగా తేనె తెట్టెలకు మంట పెట్టడం ద్వారా లేదా ఇంకా ఏదైనా టెక్నిక్ ఉపయోగించి ఇక తేనెటీగలను అక్కడి నుంచి తరిమికొట్టిన తర్వాత అవి పెట్టిన తేనే తెట్టను తీసుకొని అందులోంచి తేనెను పిండి దాన్ని అమ్మి డబ్బులు సంపాదించడం మాత్రమే ఇప్పుడు వరకు చూసాము. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తేనెటీగలు పెట్టిన తేనెతో కాదు ఏకంగా తేనెటీగల విషంతో బిజినెస్ చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా తేనెటీగల విషం అత్యంత ఖరీదు అయింది అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అనేక తీర ప్రాంతాలలో తేనేని పండించే రైతులు చాలా మంది ఉన్నారట  ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో తేనె సేకరించే రైతులు చాలా మంది ఉన్నారు. అయితే తేనెటీగల విషాన్ని సేకరించి లక్షల సంపాదిస్తున్న ఒక యువకుడు మాత్రం ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కర్ణాటకలోని మంగుళూరు శివారులో ఎన్ని కోలికి చెందిన ప్రజ్వల్ శెట్టి అనే వ్యక్తి తేనెటీగలనుంచి విషాన్ని సేకరించి దానిని ఫ్రీజర్ల భద్ర పరచడం లాంటివి చేస్తున్నాడు.



 ఏకంగా తేనెటీగలనుంచి విషాన్ని వెలికి తీసే ఒక యంత్రాన్ని కూడా కనుగొన్నాడు. దీంతో ప్రస్తుతం అతని దగ్గర ఏకంగా అయిదు రకాల తేనెటీగలకు సంబంధించిన విషం ఉంటుందట. కానీ తేనెటీగల విషాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అని అనుమానం మీకు కలిగి ఉండొచ్చు. ఏకంగా కీళ్ల నొప్పులు చికిత్సలో, బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ చికిత్సకు కూడా తేనెటీగల విషాన్ని ఉపయోగిస్తారట. అయితే ఒక పాయిజన్ కలెక్షన్ ప్లేట్ ధర మార్కెట్లో 20 వేలకు పైగానే ఉంటుంది. ముఖ్యంగా మెల్లి ఫెరా  జాతికి చెందిన విషం అయితే మరింత ప్రత్యేకమైనదట. అయితే ఈ బిజినెస్ లో సూపర్ సక్సెస్ అవుతూ లక్షల సంపాదిస్తున్నాడు ప్రజ్వల్ .

మరింత సమాచారం తెలుసుకోండి: