ఇండియాలో ప్రతి ఒక్కరికీ ఉండే గుర్తింపు కార్డు ఆధార్.ప్రతి అవసరానికి కూడా ఈరోజుల్లో ఆధార్ కార్డు ఆధారమవుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించాాలన్నా, బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్నా ఇంకా అలాగే ఏదైనా అప్లికేషన్ పెట్టాలన్నా కూడా ప్రతి దానికి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే.ఇంతటి అవసరం ఉన్న ఆధార్ ని కొంతమంది కేటుగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. మనకు తెలియకుండానే ఆధార్ ప్రామాణికతతో అకౌంట్స్ తీసుకోవడం లేదా ఓటీపీ ద్వారా మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేయడం వంటి చెత్త పనులు కూడా చేస్తున్నారు. దీంతో ఎవరికైనా ప్రూఫ్ కింద ఆధార్ ఇవ్వాలంటే ఖచ్చితంగా చాలా భయపడే పరిస్థితి వచ్చింది. ఆధార్ అంటే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేసే 12 అంకెల గుర్తింపు నెంబర్. ఈ నెంబర్ లో మన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. కాబట్టి మన ఆధార్ ని ఖచ్చితంగా భద్రపర్చుకోవాల్సిన బాధ్యత మనదే.


ఇక ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ మీ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారో? లేదో? తెలుసుకోవడానికి ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనే ఫెసిలిటీని పౌరులకు కల్పించింది.మీరు మొదటగా యూఐడీఏఐ వెబ్ సైట్ కు వెళ్లాలి. అక్కడ ప్రాధాన్యత భాష కింద తెలుగు లేదా ఇంగ్లిష్ ను మీరు ఎంచుకోవాలి. ఆ తరువాత నా ఆధార్ విభాగానికి వెళ్లాలి. ఇక అక్కడ మీకు డ్రాప్ డౌన్ మెనూ అనేది కనిపిస్తుంది.తరువాత ఆధార్ సర్వీసెస్ విభాగం కింద ఆధార్ అథెంటికేషన్ హిస్టరీపై మీరు క్లిక్ చేయాలి. అప్పుడు మీరు కొత్త వెబ్ పేజికు వెళ్తారు.ఇక అక్కడ మీ ఆధార్ నెంబర్ ఇంకా క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీను క్లిక్ చేయాలి.తరువాత మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీను కూడా ఎంటర్ చేసి ప్రోసీడ్ ను క్లిక్ చేయాలి.ఆ తరువాత ఈ పేజీలు మీ ఆధార్ వివరాలతో పాటు గత ప్రామాణికరణ అభ్యర్థనల వివరాలు కూడా కనిపిస్తాయి.ఇక మీరు ఇందులో ఏదైనా అనుమానాస్పద వినియోగాన్ని కనుక గమనిస్తే వెంటనే 1947 నెంబర్ కు కానీ లేకపోతే యూఐడీఏఐ మెయిల్ కానీ మీరు అభ్యర్థనను పంపవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: