ఇక UPI చార్జీల మీద క్లారిటీ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ).UPI యూజర్ల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే చార్జీలు చెల్లిస్తాయని క్లారిటీ ఇచ్చింది. నియోగదారులకు తక్షణం ఎటువంటి చార్జీలు ఉండవని కేంద్రం స్పష్టత ఇచ్చింది. UPI చెల్లింపులపై ఛార్జీలు విధిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను కూడా ఎన్‌పీసీఏ తీవ్రంగా ఖండించింది. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు లావాదేవీలు జరిపేందుకు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌పీసీఐ తెలిపింది. దేశంలో అత్యధికంగా 99.9 శాతం UPI ట్రాన్సక్షన్స్ బ్యాంకు అకౌంట్ల ద్వారానే జరుగుతున్నాయని ఎన్‌పీసీఏ తన ప్రకటనలో తెలిపింది.ఇక UPI చెల్లింపు కోసం బ్యాంక్ లేదా కస్టమర్ ఎలాంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌పీసీఏ తెలిపింది. 


ఇంకా అలాగే, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు UPI లావాదేవీ జరిగినా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు. ఇక రెగ్యులేటరీ మార్గదర్శకాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI వాలెట్‌లు) ఇప్పుడు ఇంటర్‌ఆపరబుల్ UPI ఎకోసిస్టమ్‌లో భాగమని కూడా ఎన్‌పీసీఏ తెలిపింది.ఇంటర్‌ఆపరబుల్ యూపీఐ పర్యావరణ వ్యవస్థలో భాగంగా PPI వాలెట్‌లను ఎన్‌పీసీఏ అనుమతిని ఇచ్చింది. ఇంటర్‌చేంజ్ ఛార్జీ PPI వ్యాపార లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుంది (అంటే ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల వ్యాపారి లావాదేవీలు). ఇందు కోసం కస్టమర్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు.ఇక NPCI సర్క్యులర్ ప్రకారం, google Pay, paytm ఇంకా PhonePe లేదా ఇతర యాప్‌ల ద్వారా చేసే చెల్లింపులపై మాక్సిమం 1.1 శాతం ఇంటర్‌చేంజ్ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఇక పేటీఎం కూడా దీనిపై క్లారిటీని ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

UPI